Page Loader
ట్రెయిల్ దశలో ఉన్న హ్యుందాయ్ క్రేటాఈవీపై భారీ అంచనాలు.. లాంచ్ ఎప్పుడో తెలుసా!
ట్రయిల్ దశలో హ్యుందాయ్ కెట్రా ఈవీ

ట్రెయిల్ దశలో ఉన్న హ్యుందాయ్ క్రేటాఈవీపై భారీ అంచనాలు.. లాంచ్ ఎప్పుడో తెలుసా!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2023
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

తన ఫోర్ట్ ఫోలియోలోని బెస్ట్ సెల్లింగ్ మోడల్ క్రేటాకు టచ్ ఇచ్చేందుకు హ్యుందాయ్ మోటర్స్ ప్లాన్ చేస్తోంది. ఈ హ్యుందాయ్ త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ-ఎస్‌యూవీ ట్రయిల్ దశలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. హ్యుందాయ్ మోటర్స్ ఇండియాలో మార్కెట్లోకి ఐయానిక్ 5, కోనా ఈవీలను లాంచ్ చేసింది. ప్రస్తుతం క్రేటా ఈవీని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. క్రేట్ కు వచ్చిన డిమాండ్, ఈవీ వర్షెన్ కి కూడా వస్తుందని హ్యుందాయ్ భారీ ఆశలను పెట్టుకుంది. హ్యుందాయ్ క్రేటా ఈవీ డిజైన్ ఐసీఈ ఇంజిన్ తోనే పోలి ఉండనుంది.

Details

ఒక్కసారి ఛార్జీ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణం

ఇందులో స్కల్ప్​టెడ్​ హుడ్​, క్లోజ్​డ్​ ఆఫ్​ గ్రిల్​ విత్​ క్రోమ్​ హెడ్​లైట్స్​, ఇంటిగ్రేటెడ్​ స్ప్లిట్​ టైప్​ డీఆర్​ఎల్స్​తో కూడిన ట్రై బీమ్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, రూఫ్​ రెయిల్స్​, స్కిడ్​ ప్లేట్స్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ ఉండడం దీని ప్రత్యేకత. 5 సీటర్ కేబిన్ లో డ్యూయెల్ టోన్ డాష్ బోర్డు, ప్రీమియం ఆప్ హోలిస్ట్రీ, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వయర్ లెస్ ఛార్జర్, యాంబియెంట్ లైటింగ్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, భారీ ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్ తో ఆకర్షణీయంగా రానుంది. దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 400 కి.మీలు ప్రయాణించే విధంగా హ్యుందాయ్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీఈ ఇంజిన్ వర్షెన్ ఎక్స్ షోరూం ధర రూ.10.87 లక్షలుగా ఉండనుంది.