Page Loader
అదిరిపోయే సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడో తెలుసా
అదిరిపోయే లుక్ లో వస్తున్న సిట్రోయెన్ సీ 3 ఎయిర్ క్రాస్

అదిరిపోయే సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడో తెలుసా

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2023
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్ కార్ వచ్చేసింది. సిట్రోయెస్ సంస్థ నుంచి ఓ కొత్త ఎస్‌యూవీ వస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పటికే ఈ మోడల్ కారు సంబంధించిన ఫోటోలను సంస్థ షేర్ చేసింది. ఈ ఎస్‌యూవీ సిట్రోయెస్ సీ3 ఎయిర్ క్రాస్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. సిట్రోయెస్ సీ3 ఎయిర్ క్రాస్ ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 27న లాంచ్ అవుతోంది. త్వరలో లాంచ్ అయ్యే ఈ మోడల్ మెడ్ ఇన్ ఇండియా కావడం విశేషం. ఇంజిన్, ఫీచర్స్, ధర వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు.

Details

కారు ఫీచర్లు, ధర

ఇందులో సీ3 ఇంజిన్‌నే ఉయోగించే అవకాశం ఉంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్ 3 రో సిటింగ్ ఉండే అవకాశాలు లేకపోలేదు. లాంచ్ సమయంలో దీనిపై క్లారిటీ ఇస్తారో లేదో వేచిచూడాలి. ఈ కారు లాంచ్ అయితే హ్యుందాయ్ కేట్రా, కియో సెల్టోస్, మారుతీ గ్రాండ్ విటారా, వోక్సోవ్యాగన్ టైగున్ వంటి మోడల్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్ షో రూం ప్రారంభ ధర రూ.9 లక్షలుగా ఉండనుంది.