Page Loader
కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం
2024 సొనాటాను అంతర్జాతీయంగా ఆవిష్కరించిన హ్యుందాయ్

కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 31, 2023
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ ఇటీవల భారత మార్కెట్లో కొత్త 2023 వెర్నాను విడుదల చేసింది, ఇది కంపెనీ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను కూడా పరిచయం చేసింది. హ్యుందాయ్ సాధారణంగా దాని సిరీస్ కు ఒకే విధమైన డిజైన్ ను రూపొందిస్తుంది. వెర్నా, ఎలంట్రా, సొనాటాలో కంపెనీ ఫ్లూయిడ్ డిజైన్ లాంగ్వేజ్‌తో వచ్చింది. ఇప్పుడు వెర్నాతో కొత్త డిజైన్‌ను పరిచయం చేయడంతో కంపెనీ ఈ డిజైన్‌ను తన ఇతర సెడాన్‌లలో కూడా ప్రయత్నించడం ప్రారంభించింది. ఇప్పుడు, హ్యుందాయ్ కొత్త 2024 సొనాటాను అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. హ్యుందాయ్ కొత్త 2024 సొనాటా స్టైలింగ్, డిజైన్ పరంగా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఇది కొంచెం ఆడి A7 డిజైన్ తో వస్తుంది.

కార్

త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ డిజైన్‌తో వస్తున్న హ్యుందాయ్ సోనాటా

హ్యుందాయ్ కొత్త త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ డిజైన్‌ను అందించింది, మధ్యలో ఒక గుండ్రటి హార్న్ ప్యాడ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను గుర్తు చేస్తుంది. ఈ కారుకు ఆటోమోటివ్ ప్రపంచంలోని అన్ని మంచి డిజైన్ అంశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. స్టీరింగ్ వీల్‌కు హార్న్ ప్యాడ్‌లకు రెండు వైపులా మల్టీఫంక్షన్ కంట్రోల్ ఉన్నాయి. కొత్త 2024 హ్యుందాయ్ సొనాటాలోని డిజిటల్ డిస్‌ప్లే మెర్సిడెస్-బెంజ్ కార్లలో ఉండే డిస్‌ప్లేలను గుర్తుచేస్తుంది. వోల్వో S90లో ఉండే ఇంటీరియర్‌ల లాగే హ్యుందాయ్ సొనాటా డ్యాష్‌బోర్డ్‌లో లేత గ్రెయిన్ వుడ్ ట్రిమ్ బ్లాండిష్ వైట్ లెదర్ సీట్లు, సెంటర్ ఆర్మ్‌రెస్ట్, డోర్ ప్యాడ్‌లతో ఉంటుంది. అంతే కాకుండా హ్యుందాయ్ సొనాటాకు డ్యూయల్ ట్విన్ బారెల్ ఎగ్జాస్ట్‌లను అమర్చింది.