LOADING...
Ford: 2,200 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మస్టాంగ్‌తో ఫోర్డ్ రికార్డ్.. డ్రాగ్ రేసింగ్‌లో సంచలనం
2,200 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మస్టాంగ్‌తో ఫోర్డ్ రికార్డ్.. డ్రాగ్ రేసింగ్‌లో సంచలనం

Ford: 2,200 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మస్టాంగ్‌తో ఫోర్డ్ రికార్డ్.. డ్రాగ్ రేసింగ్‌లో సంచలనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో మరో కొత్త మైలురాయిని అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ నమోదు చేసింది. తాజాగా విడుదల చేసిన 'ఫోర్డ్ ముస్టాంగ్ కోబ్రా జెట్ 2200' మోడల్ డ్రాగ్ రేసింగ్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ పూర్తి ఎలక్ట్రిక్ డ్రాగ్ రేసర్ కేవలం 6.87 సెకన్లలో క్వార్టర్ మైల్ దూరాన్ని పూర్తి చేసి, గంటకు 356 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. దీంతో డ్రాగ్ స్ట్రిప్‌పై అత్యంత వేగంగా పరిగెత్తిన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.

వివరాలు

కోబ్రా జెట్ 1800కి అప్‌గ్రేడ్ వెర్షన్

ఈ కొత్త మోడల్, గతంలో వచ్చిన ఫోర్డ్ ముస్టాంగ్ కోబ్రా జెట్ 1800కు మెరుగైన వెర్షన్‌గా రూపొందింది. ముఖ్యంగా ముందుగా నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండగా, ఇప్పుడు రెండు మోటార్లతోనే 2,200 హార్స్‌పవర్ శక్తిని అందిస్తోంది. పాత మోడల్ 1,800 హార్స్‌పవర్ శక్తితో ఉండగా, ఈసారి శక్తి గణనీయంగా పెరిగింది. వాహనం తక్కువ బరువుతో ఉండటంతో పాటు, వేగంగా చార్జ్ అయ్యే విధంగా రూపకల్పన చేశారు.

వివరాలు

మెరుగైన సేఫ్టీ ఫీచర్లు

ఈ హై-పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారులో భద్రతకు కూడా పెద్దపీట వేశారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్ లేదా సిబ్బంది వెంటనే యాక్టివేట్ చేయగల 'ఇన్‌స్టంట్ పవర్ కట్-ఆఫ్' సదుపాయం అందుబాటులో ఉంది. భారీ శక్తిని సమర్థవంతంగా నియంత్రించేందుకు మల్టీ-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, క్లచ్ సిస్టమ్‌ను అమర్చారు. ఇవన్నీ కలిపి, వేగంతో పాటు నియంత్రణ, భద్రతను కూడా ఈ వాహనం కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఫోర్డ్ ముస్టాంగ్ కోబ్రా జెట్ 2200 ఎలక్ట్రిక్ వాహనాల పనితీరులో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ, భవిష్యత్ EV రేసింగ్‌కు దిశానిర్దేశం చేస్తోంది.

Advertisement