McLaren: మెక్ లారెన్ నుంచి నాలుగు ప్రత్యేక ఎడిషన్లు
బ్రిటిష్ లగ్జరీ సూపర్ కార్ల తయారీ సంస్థ మెక్ లారెన్ యూకే మార్కెట్లోకి ప్రత్యేకంగా నాలుగు ప్రత్యేక ఎడిషన్లను ప్రవేశపెట్టింది. ఈ కార్లు ప్రత్యేకమైన రంగును కలిగి ఉంటాయి. మొత్తం ఇందులో ఎనిమిది డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు సరికొత్త డ్రైవింగ్ అనుభవాన్ని ఇవ్వనున్నాయి. వాస్తవానికి P1 సూపర్ కారులో సెరూలియన్ బ్లూతో రానుంది. ఇక F1 సైబర్ ఎల్లో, ఇప్పటికే ఉన్న వోల్కనో ఎల్లో ఆధారంగా వెండి రంగులో రానుంది. ప్రత్యేక-ఎడిషన్ మెక్‌లారెన్ GTలు MSO బ్లాక్ ప్యాక్‌తో రానున్నాయి. ఇందులో గ్లోస్ బ్లాక్ మిర్రర్ క్యాప్స్, ఎగువ విండో ట్రిమ్, ఎగ్జాస్ట్ యాక్సెంట్‌లు ఉన్నాయి.
మెక్ లారెన్ లో అధునాతన ఫీచర్లు
మెక్‌లారెన్ GTని 2019లో ప్రవేశపెట్టారు. ఇందులో ట్విన్-టర్బో, 4.0-లీటర్ V8 ఇంజన్‌తో 620hp, 630.45Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఏడు-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ కారు కేవలం 3.2 సెకన్లలో 0-100కిమీ వేగాన్ని అందుకోలదు. MSO 2019లో పెబుల్ బీచ్ కాన్‌కోర్స్ డి ఎలిగాన్స్ కాన్సెప్ట్ కార్ లాన్‌లో ప్రదర్శన కోసం మెక్‌లారెన్ GTలో కొన్ని మార్పులను చేశారు. ఈ కారు ప్రత్యేకంగా MSO డిఫైన్డ్ ఫ్లక్స్ సిల్వర్ బాడీ కలర్, MSO బెస్పోక్ శాటిన్ గ్రాఫైట్ ఎక్స్‌టీరియర్ యాక్సెంట్‌లు, MSO కిటికీల చుట్టూ క్రోమ్ ట్రిమ్ కలిగి ఉంది. ఈ కారు శాటిన్ గ్రాఫైట్ లెదర్ అప్హోల్స్టరీని వంటి ప్రత్యేక క్యాబిన్‌ను కలిగి ఉంది.