Page Loader
Bajaj Pulsar N160: బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్లతో పల్సర్ N160 వచ్చేసింది!
బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్లతో పల్సర్ N160 వచ్చేసింది!

Bajaj Pulsar N160: బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్లతో పల్సర్ N160 వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

పల్సర్‌ బైక్స్‌ అంటే యువతకు ఎంతో క్రేజ్‌. రైడింగ్‌కు ఇష్టపడే యూత్‌ విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బజాజ్‌ ఆటో కంపెనీ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తాజాగా బజాజ్ తన పాపులర్‌ మోడల్‌ అయిన పల్సర్‌ N160కి కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌ ప్రత్యేకతల్లో సింగిల్‌ సీటింగ్‌ సెటప్‌, డ్యూయల్‌ ఛానల్‌ ABS ప్రధానంగా నిలిచాయి. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు.

Details

డిజైన్, కంఫర్ట్ మెరుగులు 

కొత్త వేరియంట్‌ డిజైన్‌ పరంగా ఇప్పటికే ఉన్న పల్సర్‌ N160లాగే ఉండగా, స్ప్లిట్ సీటు స్థానంలో సింగిల్‌ పీస్ సీటును ఏర్పాటు చేశారు. దీని వల్ల పిలియన్‌ రైడర్‌కు మరింత సౌకర్యం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే, స్ప్లిట్ రియర్‌ గ్రాబ్‌ రైల్స్‌కు బదులుగా సింగిల్‌ పీస్ యూనిట్‌ను అందించారు.

Details

 టెక్నికల్ ఫీచర్లు 

ఈ బైక్‌లో 37mm టెలిస్కోపిక్ ఫోర్కులు, మోనోషాక్‌ సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్‌ ABS వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇది 300mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 280mm రియర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంది. ఇది గత బేస్ వేరియంట్‌తో పోలిస్తే మెరుగైన బ్రేకింగ్‌ సామర్థ్యాన్ని ఇస్తుంది. అలాగే 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌, ట్యూబ్‌లెస్ టైర్లు, 165mm గ్రౌండ్ క్లియరెన్స్, 795mm సీటు ఎత్తు, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 154 కిలోల బరువు ఈ బైక్‌కు ఉన్నాయి.

Details

ఇంజిన్‌ శక్తి, డిజిటల్ కనెక్టివిటీ

ఇందులో 164.82cc, సింగిల్‌-సిలిండర్, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్ ఉండగా, ఇది 16PS పవర్‌, 14.65Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా, ఈ బైక్‌లో బ్లూటూత్‌ కనెక్టివిటీ ఫీచర్‌ కలిగిన LCD ఇన్స్ట్రుమెంట్‌ కన్సోల్ ఉంది. కాల్స్‌, మెసేజెస్‌, లో ఫ్యూయల్‌ హెచ్చరిక వంటి సమాచారం ఇందులో కనిపిస్తుంది. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.