Tesla: టెస్లా లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త Model Y 2026 ఇండియాలో లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టెస్లా మోడల్ వై' ధరలను భారీగా తగ్గించింది. అదే సమయంలో కంపెనీ సరికొత్త "టెస్లా మోడల్ వై 2026" వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త నిర్ణయంతో కారు ధరను ఏకంగా రూ.9 లక్షల వరకు తగ్గించడం విశేషం. ఇప్పటివరకు 'టెస్లా మోడల్ వై' బేస్ వేరియంట్ అయిన 'రియర్ వీల్ డ్రైవ్' ప్రారంభ ధర రూ.59.89లక్షలుగా ఉండేది. తాజాగా కంపెనీ దీనిని రూ.50.89లక్షలకు తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచిన మోడల్ వై.. భారత మార్కెట్లో మాత్రం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సేల్స్ నమోదు చేయలేకపోయింది.
వివరాలు
బ్యాటరీ, పవర్ వివరాలు
ఈ కారు 5-సీటర్, 6-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది. వాహన డెలివరీలు జూలై 2026 నుంచి ప్రారంభం కానున్నాయి బేస్ 5-సీటర్ ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లో 64kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది 299 హెచ్‌పీ పవర్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇక 'లాంగ్ రేంజ్' వేరియంట్‌లో 84.2kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని అమర్చారు. ఈ వేరియంట్‌ను ఈ ఏడాది ప్రారంభంలో రూ.67.89 లక్షల ధరతో విడుదల చేశారు. అయితే తాజాగా ధరల్లో మార్పులు చేసినప్పటికీ, లాంగ్ రేంజ్ వేరియంట్ ధరను మాత్రం కంపెనీ యథాతథంగా ఉంచింది.
వివరాలు
Model Y L వేరియంట్ ప్రత్యేకతలు
టెస్లా ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన లాంగ్ వీల్‌బేస్ వేరియంట్ 'మోడల్ వై ఎల్' ప్రారంభ ధర రూ.61.99 లక్షలుగా ఉంది. అంటే బేస్ మోడల్ వై కంటే ఇది దాదాపు రూ.11.1 లక్షలు ఎక్కువ. ఈ 'మోడల్ వై ఎల్' వేరియంట్‌లో ఎక్కువ స్పేస్, అదనపు సీట్లు, అధిక డ్రైవింగ్ రేంజ్‌తో పాటు 'ఆల్ వీల్ డ్రైవ్' ఫీచర్ కూడా లభిస్తుంది.
వివరాలు
రేంజ్, ఫీచర్లు
టెస్లా మోడల్ వై ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 238 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 19-ఇంచుల వీల్స్‌తో వచ్చే ఈ కారులో టెక్స్చర్డ్ ఫినిషింగ్ ఇంటీరియర్‌ను అందించారు. కారు ముందు భాగంలో 16-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఉండగా, ముందు సీట్లలో పవర్ రెక్లైనింగ్, పవర్ టిల్ట్, హీటెడ్, వెంటిలేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. రెండో వరుస ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.