హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ 114 v/s ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్.. ఇందులో బెస్ట్ ఏదీ!
యుఎస్ ఆటోమేకర్ హార్లే-డేవిడ్సన్ 2023 ఫ్యాట్ బాబ్ 114 మోటర్ బైక్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ చూడటానికి ఎంతో అకర్షణీయంగా, అనేక ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్‌లు, శక్తివంతమైన 1,868cc మిల్వాకీ-ఎయిట్ 114 ఇంజన్ ఫీచర్లు కలిగిఉండడం దీని ప్రత్యేకత. దీనికి ధీటుగా ఇండియన్ చీఫ్‌డార్క్ హార్స్ బైక్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఏ బైకుకు ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి.. ఏది కొనుక్కోవాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఫ్యాట్ బాబ్ 114లో టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధనట్యాంక్, స్ప్లిట్-స్టైల్ సీట్లు, ట్విన్-టిప్ ఎగ్జాస్ట్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది పూర్తి-LED లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. బైక్‌గ్రేహేజ్, వివిడ్ బ్లాక్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది
డార్క్ హార్స్ కొంచెం పెద్ద ఇంజన్‌ని కలిగి ఉంది
హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ 114 1,868cc మిల్వాకీ-ఎయిట్ 114 ఇంజన్‌పై నడుస్తుంది, ఇది గరిష్టంగా 92.5hp శక్తిని, 160Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్యాట్ బాబ్ 114 ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, ముందు వైపు 43 మిమీ ఇన్‌వర్టెడ్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో కాయిల్-ఓవర్ మోనో-షాక్ యూనిట్‌తో అమర్చబడి ఉంటుంది. భారతదేశంలో, 2023 హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ 114 ధర రూ. 20.49-20.68 లక్షలు. కాగా, ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్ ధర రూ. 22.13-22.25 లక్షలు ఉండనుంది. డార్క్ హార్స్ కొంచెం ఖరీదు ఎక్కువని చెప్పొచ్చు.