Page Loader
CB300R బైకులను రీకాల్ చేసిన హోండా.. కారణం ఇదే!
బైకులను రీకాల్ చేయనున్న హోండా కంపెనీ

CB300R బైకులను రీకాల్ చేసిన హోండా.. కారణం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2023
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంజిన్‌లో లోపాల కారణంగా హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా CB300R బైకులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన CB300R బైకులను కూడా రీకాల్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంజిన్ కుడి క్రాంక్ కేస్ కవల్ లో తయారీ సరైన పద్ధతిలో జరగలేదని కంపెనీ గుర్తించింది. ఇంజిన్ వేడి వల్ల ఏర్పడే నిరోధక శక్తిని తగ్గించడానికి సీలింగ్ ప్లగ్ ని తొలిగించే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందులో సీలింగ్ ఆఫ్ అయిపోతే ఇంజిన్ నుంచి ఆయిల్ బయటికొచ్చ ప్రమాదం ఉందని, దీంతో మోటర్ సైకిల్ విడి భాగాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు

బైక్

ఏప్రిల్ 15 నుంచి ఉచితంగా రీప్లేస్‌మెంట్

వేడి ఉష్ణోగ్రతల వల్ల టైర్లు స్లిప్ అయి, దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తులు తీవ్రంగా గాయపడే అవకాశం ఉందని హెచ్ఎంఎస్ఐ వెల్లడించింది. దేశమంతటా ఏప్రిల్ 15 నుంచి వారంటీతో సంబంధం లేకుండా ఉచితంగా రీప్లేస్‌మెంట్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. క‌స్ట‌మ‌ర్లు త‌మ వాహ‌నాల‌ను ప‌రీక్షించుకునేందుకు రావాల‌ని ఫోన్ ద్వారా గానీ, ఈ-మెయిల్ ద్వారా గానీ, ఎస్ఎంఎస్‌ల ద్వారా గానీ బిగ్‌వింగ్ డీల‌ర్లు నోటిఫై చేస్తార‌ని తెలియజేసింది. స్పోర్టీ లుక్‌తో ఉన్న న్యూ బైక్ సీబీ300ఆర్‌ను ఆవిష్క‌రించింది. దీని ధ‌ర రూ.2.77 ల‌క్ష‌లుగా ధ్రువీకరించారు.