Page Loader
అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్
ఇది హార్లే డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా రిటైల్ అవుతుంది

అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్

వ్రాసిన వారు Nishkala Sathivada
Apr 05, 2023
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో మోటోకార్ప్‌ సహకారంతో నిర్మించిన హార్లే-డేవిడ్సన్ మొట్టమొదటి మోటార్‌సైకిల్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఇది పూర్తిగా ఇక్కడే తయారు అవుతుంది. ఇప్పుడు, ద్విచక్ర వాహనం చిత్రాలు బయట లీక్ అయ్యాయి. ఇది సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తుంది. సెప్టెంబర్ 2020లో, హార్లే-డేవిడ్సన్ తగ్గిన అమ్మకాలను పేర్కొంటూ భారత మార్కెట్ నుండి నిష్క్రమించింది. అయితే, మళ్ళీ హీరో మోటోకార్ప్‌తో ఒప్పందం చేసుకున్న తర్వాత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. ఈ ఒప్పందం రెండు సంస్థలకు అత్యంత ప్రయోజనకరమే. 2022లో, కంపెనీలు రెండూ కలిపి మోటర్‌బైక్‌ల సిరీస్ అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే మోడల్ ఈ సిరీస్ లో మొదటిది, ఇది హార్లే డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా రిటైల్ అవుతుంది.

బైక్

రాబోయే హార్లే బైక్ నియో-రెట్రో క్రూయిజర్ డిజైన్‌తో ఉంటుంది

రాబోయే హార్లే బైక్ నియో-రెట్రో క్రూయిజర్ డిజైన్‌తో ఉంటుంది, ఇందులో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, విశాలమైన హ్యాండిల్‌బార్, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్, సింగిల్-పీస్ సీట్ ఉంటాయి. కొత్త హార్లే-డేవిడ్‌సన్ బైక్‌లో దాదాపు 400సీసీ కెపాసిటీ ఉన్న ఎయిర్/ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో నడుస్తుంది. రైడర్ భద్రత కోసం, రోడ్లపై మెరుగైన హ్యాండ్లింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. భారతదేశంలో, రాబోయే హార్లే-డేవిడ్‌సన్ బైక్ ఎంట్రీ-లెవల్ మోడల్‌ ధర దాదాపు రూ. 2.5 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350తో పోటీ పడుతుంది.