Page Loader
హార్లే-డేవిడ్సన్ నుండి వస్తున్న చౌకైన మోటార్‌సైకిల్ X350
హార్లే-డేవిడ్‌సన్ X350 స్ట్రీట్‌ఫైటర్ డిజైన్ ఫిలాసఫీతో వస్తుంది

హార్లే-డేవిడ్సన్ నుండి వస్తున్న చౌకైన మోటార్‌సైకిల్ X350

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 10, 2023
06:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

US తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం సరికొత్త X350 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ బైక్ ఇండియాకు కూడా వచ్చే అవకాశం ఉంది. హార్లే-డేవిడ్‌సన్ APAC (ఆసియా-పసిఫిక్) ప్రాంతంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి చాలా కష్టపడింది. చైనా, భారతదేశం మార్కెట్‌లలో X350 మోడల్‌ను పరిచయం చేయడం ద్వారా దానిని మార్చాలని ఆలోచిస్తుంది. QJ మోటార్‌తో పాటు సరికొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సరికొత్త హార్లే-డేవిడ్‌సన్ X350 స్ట్రీట్‌ఫైటర్ డిజైన్ ఫిలాసఫీతో, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, పెరిగిన హ్యాండిల్ బార్, రౌండ్ మిర్రర్ యూనిట్లు, సింగిల్-పీస్ స్టెప్-అప్ సీటు, అండర్-బెల్లీ ఎగ్జాస్ట్, టేపర్డ్ టెయిల్ సెక్షన్ ఉన్నాయి.

బైక్

ఇందులో కనెక్టివిటీ ఆప్షన్స్ తో ఉన్న సింగిల్-పాడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది

మోటార్‌సైకిల్‌లో కనెక్టివిటీ ఆప్షన్స్ తో ఉన్న సింగిల్-పాడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది, ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది హార్లే-డేవిడ్‌సన్ X350 QJ మోటార్-సోర్స్డ్ 353cc, DOHC, 8-వాల్వ్, లిక్విడ్-కూల్డ్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయిన ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. రైడర్ భద్రత కోసం, కొత్త హార్లే-డేవిడ్సన్ X350 మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. చైనాలో, సరికొత్త హార్లే-డేవిడ్‌సన్ X350 ధర CNY 33,388 (సుమారు రూ. 3.93 లక్షలు). ఈ మిడిల్ వెయిట్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ త్వరలో భారతదేశంలోకి రానుంది.