Loading...
Harley-Davidson Sprint 440: విడుదలకు ముందే రివీల్‌ - డిజైన్, ఇంజిన్‌పై ఆసక్తికర అప్‌డేట్
విడుదలకు ముందే రివీల్‌ - డిజైన్, ఇంజిన్‌పై ఆసక్తికర అప్‌డేట్

Harley-Davidson Sprint 440: విడుదలకు ముందే రివీల్‌ - డిజైన్, ఇంజిన్‌పై ఆసక్తికర అప్‌డేట్

వ్రాసిన వారు Balachander Sharma
Oct 27, 2026
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

హార్లీ-డేవిడ్‌సన్ నుంచి మరో కొత్త క్రూయిజర్ బైక్‌ భారత మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హార్లీ-డేవిడ్‌సన్ స్ప్రింట్ 440 మోటార్‌సైకిల్‌ ఎలాంటి కవరింగ్‌ లేకుండా కనిపించడంతో దాని డిజైన్‌పై స్పష్టత వచ్చింది. 2026 నవంబర్ 3న మిలాన్‌లో జరగనున్న EICMA ప్రదర్శనలో ఈ బైక్‌ ప్రపంచవ్యాప్తంగా పరిచయం కావచ్చని అంచనా. ఇప్పటికే భారతదేశంలోని కొన్ని డీలర్‌షిప్‌లకు చేరుతున్నట్లు సమాచారం రావడంతో దీని లాంచ్‌పై ఆసక్తి పెరిగింది.

Details

ఆకట్టుకునే ప్యూయల్‌ ట్యాంక్‌ డిజైన్

స్ప్రింట్ 440లో ప్రధానంగా కనిపించే మార్పు దాని క్రూయిజర్ డిజైన్‌. కొత్త ఫ్యూయల్ ట్యాంక్‌, ఒకే భాగంగా రూపొందించిన లోతైన సీటు, వెనక్కి వాలిన హ్యాండిల్‌బార్లు దీనికి ప్రత్యేక రూపాన్ని ఇస్తున్నాయి.

నలుపు రంగు ఫినిషింగ్‌తో పాటు ఇంజిన్‌పై మెషీన్‌ ఫిన్స్‌, ఎగ్జాస్ట్‌పై మెరిసే హీట్‌ షీల్డ్‌ ఆకర్షణగా నిలుస్తాయి. ట్యాంక్‌పై నారింజ రంగు అంచులతో కూడిన గ్రాఫిక్స్‌, పక్క భాగంలో Sprint బ్రాండింగ్‌ కనిపిస్తున్నాయి.

నలుపుతో పాటు నీలం, బూడిద, ఎరుపు రంగుల్లోనూ ఈ బైక్‌ కనిపించింది. ముందు భాగంలో గుండ్రటి హెడ్‌ల్యాంప్‌, ప్రత్యేక టర్న్‌ ఇండికేటర్లు, చిన్న మడ్‌గార్డ్‌ను అమర్చారు.

Details

ప్రయాణ సౌకర్యానికి ప్రాధాన్యం

స్ప్రింట్ 440ను సుదూర ప్రయాణాలకు అనుకూలమైన రైడింగ్‌ పొజిషన్‌తో రూపొందించినట్లు కనిపిస్తోంది. X440తో పోలిస్తే వీల్‌బేస్‌ పొడవుగా ఉండే అవకాశం ఉంది.

ఫుట్‌పెగ్స్‌ను కొద్దిగా ముందుకు అమర్చడం వల్ల క్రూయిజర్‌ తరహా కూర్చునే విధానం లభించనుంది.

ముందు భాగంలో అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్కులు, వెనుక రెండు షాక్‌ అబ్జార్బర్లు, రెండు చక్రాలకూ డిస్క్‌ బ్రేకులు ఉన్నాయి. ముందు చక్రానికి ఏబీఎస్‌ సెన్సర్‌ రింగ్‌ కూడా కనిపిస్తోంది.

ADVERTISEMENT

Details

ఇంజిన్‌, లాంచ్‌ వివరాలు

ఈ బైక్‌లో X440లోని 440 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌-ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉండవచ్చని అంచనా. X440లో ఈ ఇంజిన్‌ 27 బీహెచ్‌పీ పవర్‌, 38 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అయితే, స్ప్రింట్ 440లో పవర్‌, టార్క్‌ గణాంకాలు లేదా ఇంజిన్‌ ట్యూనింగ్‌లో మార్పులపై కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించలేదు. హీరో మోటోకార్ప్‌ భాగస్వామ్యంతో భారత్‌లోనే ఈ బైక్‌ తయారుకానుంది.

X440కు భిన్నమైన సంప్రదాయ క్రూయిజర్‌ రూపాన్ని కోరుకునే కొనుగోలుదారులకు స్ప్రింట్ 440 మరో ఎంపికగా నిలిచే అవకాశం ఉంది. దీని ధర, అధికారిక లాంచ్‌ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT