LOADING...
Hero Xtreme 160R 4V Edition: హీరో ఎక్స్‌ట్రీమ్ కొత్త ఎడిషన్ విడుదల 
హీరో ఎక్స్‌ట్రీమ్ కొత్త ఎడిషన్ విడుదల

Hero Xtreme 160R 4V Edition: హీరో ఎక్స్‌ట్రీమ్ కొత్త ఎడిషన్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

Hero MotoCorp తన ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ కమ్యూటర్ Xtreme 160R 4V‌కు కొత్తగా Combat Edition అనే ప్రత్యేక వెర్షన్‌ను పరిచయం చేసింది. 160cc సెగ్మెంట్‌లో స్టైలిష్‌గా, ఆధునిక టెక్నాలజీలతో కూడిన బైక్ కోరుకునే రైడర్‌ల కోసం ఈ ఎడిషన్‌ను తీసుకువచ్చారు. ధరను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినా, అందించిన హై-ఎండ్ ఫీచర్‌ల కారణంగా ఇది రెగ్యులర్ మోడల్ కంటే స్వల్పంగా ఎక్కువ ధరలో ఉండే అవకాశముంది. ముఖ్యంగా, ఇందులోని అనేక ఫీచర్‌లు ఈ క్యాటగిరీలో తొలిసారి అందుబాటులోకి వస్తున్నాయని హీరో తెలిపింది.

వివరాలు 

ప్రీమియం లుక్, మరింత స్పోర్టీ డిజైన్

Combat Edition మొత్తం రూపంలోనే ఫ్రెష్ మరియు మోడ్రన్ ఫీల్‌ను ఇస్తుంది. ఇందులో కొత్తగా Combat Grey అనే రంగును హీరో అందించింది. హెడ్‌ల్యాంప్‌ను కూడా రీడిజైన్ చేశారు. ఇది ఇప్పుడు Xtreme 250R స్టైలింగ్‌లానే కనిపిస్తుంది. దీనివల్ల బైక్‌కి ముందు భాగం మరింత అగ్రెసివ్‌గా, షార్ప్‌గా, స్పోర్టీగా మారింది. మొత్తానికి, సాధారణ వెర్షన్‌తో పోలిస్తే ఈ ఎడిషన్ మరింత ప్రీమియంగా తయారైంది. ముఖ్యంగా యువ రైడర్‌లను ఆకట్టుకునేలా డిజైన్‌ను తీర్చిదిద్దారు.

వివరాలు 

160cc క్లాస్‌లో హై-టెక్ ఫీచర్ల హంగామా

Combat Edition‌కి ప్రధాన ఆకర్షణ దాని ఆధునిక ఫీచర్‌లు. 160ccసెగ్మెంట్‌లో కొత్త టెక్నాలజీని అందించేందుకు హీరో ఈ ఎడిషన్‌లో కొన్ని ఫీచర్లను తొలిసారిగా ప్రవేశపెట్టింది. మొదటగా క్రూయిజ్ కంట్రోల్ ఇవ్వడం దీని హైలైట్.ఈ కేటగిరీలో ఈ ఫీచర్ మొట్టమొదటిసారి వస్తోంది. లాంగ్ రైడ్‌లలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే Rain,Road,Sport అనే మూడు రైడింగ్ మోడ్‌లు అందించారు.ఇవి రహదారి పరిస్థితులు,రైడింగ్ స్టైల్‌కి అనుగుణంగా బైక్ ప్రతిస్పందనను మార్చుకుంటాయి. రైడ్-బై-వైర్ టెక్నాలజీ థ్రోటిల్‌ను మరింత స్మూత్‌గా, నిశితంగా పనిచేయేలా చేస్తుంది. కొత్త ఫుల్-కలర్ LCD డిస్‌ప్లే బైక్‌కి ఓ ఆధునిక స్పోర్ట్స్ మెషిన్ లాంటి ఫీలింగ్‌ను ఇస్తుంది. అదనంగా 0-60 km/h టైమర్,క్వార్టర్-మైల్ రికార్డర్ వంటి ఫీచర్లు స్పోర్ట్స్ బైక్‌లను ఇష్టపడే వారికి పెర్ఫార్మెన్స్‌ను ట్రాక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.

వివరాలు 

సేమ్ ఇంజిన్, బలమైన పనితీరు

Combat Edition‌లో ఇంజిన్ మాత్రం Xtreme 160R 4Vలో ఉపయోగించినదే. ఇది 163cc, 4-వాల్వ్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ యూనిట్, 16.66 hp పవర్ మరియు 14.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ట్రాఫిక్ నుంచి హైవే రైడింగ్ వరకు అన్ని పరిస్థితుల్లోనూ ఇది వేగవంతమైన, స్థిరమైన పనితీరును అందిస్తుంది. కొత్తగా జోడించిన ఫీచర్‌లతో పాటు, ఈ ఎడిషన్ ఇప్పుడు తన విభాగంలో అత్యంత మోడ్రన్‌గా, బ్యాలెన్స్డ్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు.