Loading...
Honda Alpha EV: హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ...భారత్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ
హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ...భారత్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ

Honda Alpha EV: హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ...భారత్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 03, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు హోండా సిద్ధమైంది. ఇప్పటివరకు పెట్రోల్, హైబ్రిడ్ కార్లతో గుర్తింపు తెచ్చుకున్న హోండా కార్స్ ఇండియా.. ఇప్పుడు తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. ఈ కొత్త వాహనానికి హోండా ఆల్ఫా అని పేరు ఖరారు చేసింది. డిసెంబర్ 2న ఈ కారును ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో దేశీయ ఈవీ మార్కెట్లోకి మరో ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ ప్రవేశించబోతోంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు పోటీపడుతున్న ఈ విభాగంలో హోండా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Details

0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా రూపకల్పన

హోండా ఆల్ఫా రూపకల్పనకు గతేడాది జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించిన హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్‌ను ఆధారంగా తీసుకున్నారు. ఆ ప్రదర్శనలో ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఆకట్టుకున్న ఈ కాన్సెప్ట్‌కు దగ్గరగా తుది మోడల్ ఉండే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

అయితే ప్రొడక్షన్ మోడల్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయో డిసెంబర్ 2న పూర్తిస్థాయిలో తెలియనుంది.

కేవలం డిజైన్‌కే పరిమితం కాకుండా, భారతీయ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టి పెట్టింది.

Details

భారత్‌లోనే తయారీ.. విదేశాలకూ ఎగుమతి

ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం దేశీయ తయారీ. 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యానికి అనుగుణంగా హోండా ఆల్ఫాను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాలని కంపెనీ నిర్ణయించింది.

దేశీయ మార్కెట్లో విక్రయించడంతో పాటు, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలని ప్రణాళిక రూపొందించింది. భారత రోడ్లు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాహనాన్ని పరీక్షించారు.

గత మార్చి నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో రోడ్ టెస్టింగ్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో బ్యాటరీ పనితీరు, వాహనం మన్నిక, వివిధ రహదారులపై ప్రయాణించే సామర్థ్యాన్ని పరిశీలించారు.

ADVERTISEMENT

Details

టాటా, మహీంద్రా, హ్యుందాయ్‌లకు పోటీ?

ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లో టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలు తమ మోడళ్లతో పోటీపడుతున్నాయి.

ఇప్పుడు హోండా ఆల్ఫా రాకతో ఈ విభాగంలో పోటీ మరింత పెరగనుంది. అయితే ఈ కారును కొనుగోలుదారులు ఎంతవరకు ఆదరిస్తారనేది దాని ధర, రేంజ్, ఫీచర్లపై ఆధారపడి ఉంటుంది.

డిసెంబర్ 2న జరిగే ఆవిష్కరణలో బ్యాటరీ సామర్థ్యం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరం, టెక్నాలజీ ఫీచర్లు, ధర వంటి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ వివరాలే భారత మార్కెట్లో హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

ADVERTISEMENT