'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా
ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో మాక్సీ-స్కూటర్ విభాగంలో హోండా మంచి పేరుంది. భారతదేశంలో మాత్రం మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో ఈ సంస్థ అడుగుపెట్టలేదు. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద స్కూటర్ మార్కెట్‌లలో ఒకటి అయితే, ఇక్కడ ప్రధానంగా సాధారణ, కమ్యూటర్-స్టైల్ స్కూటర్‌లు ఎక్కువ. గతంలో సాధారణ ప్రజలు వీటిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు అందుకే తయారీ సంస్థలు వీటి జోలికి పోలేదు. మ్యాక్సీ-స్కూటర్ సెగ్మెంట్ భారత మార్కెట్‌కు కొత్త కాదు. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, యమహా ఏరోక్స్ 155, అప్రిలియా SXR సిరీస్ విడుదల చేయడంతో ఈమధ్య కాలంలో మ్యాక్సీ-స్కూటర్ సెగ్మెంట్ నెమ్మదిగా ట్రాక్షన్‌ను పొందుతోంది. ఈ విభాగం వాస్తవానికి 2006లో కైనెటిక్ బ్లేజ్ ద్వారా మొదలైంది. పేలవమైన అమ్మకాల కారణంగా దీని ఉత్పత్తి ఆగిపోయింది.
ఎప్రిలియా SXR సిరీస్, యమహా ఏరోక్స్ 155 రాకతో మాక్సి స్కూటర్ విభాగంలో మార్పులు
ఎప్రిలియా SXR సిరీస్, యమహా ఏరోక్స్ 155 రాకతో పరిస్థితులు మారడం ప్రారంభించాయి. అప్పుడు బి ఎం డబ్ల్యూ C 400 GT, Keeway's Vieste 300, Sixties 300i వంటి సామర్థ్యం గల మోడల్‌లు ఇక్కడ మార్కెట్ కు వచ్చాయి. 2023 హోండా ADV 160 ఒక సాధారణ మ్యాక్సీ-స్కూటర్ లాగా ఉంటుంది. ఆప్రాన్-మౌంటెడ్ డ్యూయల్-పాడ్ LED హెడ్‌లైట్‌లు, స్టెప్-అప్ సీట్, స్పైన్-మౌంటెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, LED టెయిల్‌లైట్ ఉన్నాయి. రైడర్ భద్రత కోసం, ఇందులో రెండు చక్రాలపై కలిపి బ్రేకింగ్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లతో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది 157cc, లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్ ఇంజన్ తో నడుస్తుంది.