LOADING...
Honda City: మే 22న విడుదలకు సిద్ధమైన హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. టీజర్ రిలీజ్.. కొత్త ఫీచర్లు ఇవే!
టీజర్ రిలీజ్.. కొత్త ఫీచర్లు ఇవే!

Honda City: మే 22న విడుదలకు సిద్ధమైన హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. టీజర్ రిలీజ్.. కొత్త ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్‌లో హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. మే 22న ఈ కొత్త సెడాన్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన టీజర్‌లో స్లిమ్ LED లైట్ సిగ్నేచర్‌ను మాత్రమే చూపించినా.. ఇప్పటికే బయటకు వచ్చిన స్పై ఫొటోలు, డీలర్‌షిప్‌ల వద్ద కనిపించిన మోడళ్లతో కొత్త హోండా సిటీ డిజైన్‌పై స్పష్టత వచ్చింది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో స్టైలింగ్ మార్పులు, కొత్త ఫీచర్లు, కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్ ఉండనున్నాయి. అయితే ఇంజిన్ సెటప్ మాత్రం పాతదే కొనసాగనుంది.

వివరాలు 

కొత్త డిజైన్‌తో LED హెడ్‌ల్యాంప్స్

కొత్త హోండా సిటీ ముందు భాగంలో భారీ మార్పులు కనిపించనున్నాయి.కొత్త డిజైన్‌తో LED హెడ్‌ల్యాంప్స్, పైభాగంలో DRLs ఇవ్వనున్నారు. గ్రిల్ అంతా కలిపే కనెక్టెడ్ లైటింగ్ ఎలిమెంట్ ఈ కారుకు మరింత ప్రీమియం లుక్ తీసుకురానుంది. ముందు బంపర్‌ను కూడా స్పోర్టీ స్టైల్‌లో పూర్తిగా కొత్తగా డిజైన్ చేశారు. ఆసక్తికరంగా స్పై షాట్స్‌లో కనిపించిన టెస్ట్ కారులో ఫాగ్ ల్యాంప్స్ కనిపించలేదు.సైడ్ ప్రొఫైల్ మాత్రం ప్రస్తుత మోడల్‌లానే ఉండనుంది. అయితే కొత్త బ్లాక్ ఫినిష్ అల్లాయ్ వీల్స్‌తో కాస్త స్పోర్టీ టచ్ ఇవ్వనున్నారు.వీటి సైజు 16ఇంచులుగానే ఉండే అవకాశం ఉంది. వెనుక భాగంలో కొత్త బంపర్ డిజైన్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరింత స్పష్టంగా కనిపించనుంది. పాత C-షేప్ డిజైన్‌ను తొలగించినట్లు సమాచారం.

వివరాలు 

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్

క్యాబిన్‌లో కూడా కొన్ని కీలక మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న 8 ఇంచుల స్క్రీన్ స్థానంలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌తో స్క్రీన్‌ను మరింత ఎత్తుగా అమర్చే అవకాశం ఉంది. అలాగే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ కూడా అందించనున్నారు. బ్లాక్-బేజ్ ఇంటీరియర్ థీమ్, బేజ్ సీట్స్, అంబియంట్ లైటింగ్, స్టీరింగ్ వీల్ డిజైన్ మాత్రం ప్రస్తుత మోడల్‌దే కొనసాగనుంది. ఇంజిన్ విషయానికి వస్తే.. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించనున్నారు. ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు CVT ఆటోమేటిక్ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.

Advertisement