Honda ZR-V SUV: రేపే హోండా కొత్త ఫ్లాగ్‌షిప్ SUV లాంచ్.. ZR-Vలో ఏమేమి ప్రత్యేకతలివే!
ఈ వార్తాకథనం ఏంటి
హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో కొత్త ప్రీమియం ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న హోండా ZR-V e:HEV మే 22న అధికారికంగా భారత్‌లో లాంచ్ కానుంది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసే CBU మోడల్‌గా ఈ ఎస్‌యూవీ రానుండగా, ప్రస్తుతం ఉన్న హోండా ఎలివేట్ కంటే పై స్థాయిలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలవనుంది. చాలా కాలం తర్వాత ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హోండా తిరిగి అడుగుపెడుతుండటం విశేషం.
వివరాలు
ఆకర్షణీయమైన డిజైన్‌తో హోండా ZR-V
కొత్త హోండా ZR-V ఎస్‌యూవీ స్పోర్టీ మరియు స్టైలిష్ డిజైన్‌తో ఆకట్టుకోనుంది. ముందు భాగంలో షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్‌తో పాటు L-షేప్ LED DRLs ఇవ్వనున్నారు. గ్రిల్ మధ్యలో ఇల్యూమినేటెడ్ హోండా లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న మోడల్‌ను ఆధారంగా తీసుకుంటే, క్రోమ్ ఫినిష్ గ్రిల్, స్పోర్టీ బంపర్ డిజైన్, ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్, హనీకోంబ్ స్టైల్ ఎయిర్ ఇన్‌టేక్ వంటి ప్రీమియం డిజైన్ ఎలిమెంట్స్ భారత్ మోడల్‌లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీకి కూపే తరహా సిల్హౌట్, తక్కువ ఎత్తులో ఉండే రూఫ్‌లైన్, ఫ్లష్ రూఫ్ రైల్స్, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు అందించనున్నారు.
వివరాలు
ప్రీమియం ఫీచర్లతో కేబిన్
పరిమాణాల విషయానికి వస్తే, హోండా ZR-V పొడవు 4,568 మి.మీ, వెడల్పు 1,840 మి.మీ, ఎత్తు 1,620 మి.మీగా ఉంటుంది. వీల్‌బేస్ 2,657 మి.మీ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మి.మీగా ఉంది. బూట్ స్పేస్ 390 లీటర్లు ఉండనుండగా, వేరియంట్‌ను బట్టి 17 నుంచి 19 అంగుళాల అలాయ్ వీల్స్ ఇవ్వొచ్చు. హోండా ZR-V ఇంటీరియర్‌ను డ్యూయల్ టోన్ థీమ్‌తో ప్రీమియంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో పాటు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.2 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండొచ్చు.
వివరాలు
రియర్ వ్యూ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు
అలాగే పవర్డ్ ఫ్రంట్ సీట్స్, మెమరీ ఫంక్షన్, పవర్డ్ టెయిల్‌గేట్, అంబియెంట్ లైటింగ్, 12 స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్ వంటి హైఎండ్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 ADAS, ISOFIX మౌంట్స్, రియర్ వ్యూ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఇవ్వనున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో సులభంగా ఉపయోగించుకునేలా ఫిజికల్ బటన్స్, కంట్రోల్స్‌ను కొనసాగించడం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
వివరాలు
హైబ్రిడ్ ఇంజిన్‌తో శక్తివంతమైన పనితీరు
హోండా ZR-V e:HEVలో 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. దీనికి e-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడుతుంది. ఈ హైబ్రిడ్ సెటప్ ద్వారా సుమారు 184 హెచ్‌పీ పవర్, 315 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ వివరాల ప్రకారం, ఈ ఎస్‌యూవీ 0 నుంచి 100 కిమీ వేగాన్ని దాదాపు 8 సెకన్లలో చేరుకోగలదు.
వివరాలు
ధర ఎంత ఉండొచ్చు?
భారత మార్కెట్లో హోండా ZR-V ధర రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత ఈ ఎస్‌యూవీ స్కోడా కొడియాక్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్, జీప్ మెరిడియన్ వంటి ప్రీమియం ఎస్‌యూవీలకు పోటీ ఇవ్వనుంది.