విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం
ఈ వార్తాకథనం ఏంటి
స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో లియో ఈ-స్కూటర్ హై-స్పీడ్ వెర్షన్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 81,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120కిమీల వరకు నడుస్తుంది. ఈ నెల నుండి ఆ బ్రాండ్ షోరూమ్ లో అందుబాటులో ఉంటుంది.
HOP లియో: ఇందులో ఆప్రాన్-మౌంటెడ్ LED హెడ్‌లైట్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, సింగిల్-పీస్ సీట్,బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. రైడర్ భద్రత కోసం దీనికి ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.
బైక్
Hero VIDA V1 ఒకసారి చార్జ్ చేస్తే 165 కిమీ నడుస్తుంది
Ola S1: ఒక చార్జికి 141కిమీ నడుస్తుంది. భారతదేశంలో దీని ధర రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్). ఇందులో LED హెడ్‌లైట్, సింగిల్-పీస్ సీటు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉన్నాయి. భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) ఉన్నాయి.
Ather 450X Gen3: ఒక చార్జికి 146 కిమీ నడుస్తుంది, ధర 1.58 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో మోనో-షాక్ రియర్ యూనిట్, పోర్టబుల్ హోమ్ ఛార్జర్ యూనిట్ ఉన్నాయి.
Hero VIDA V1: ఒక చార్జికి 165 కిమీ నడుస్తుంది. ధర 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)
TVS iQube: ఒక చార్జికి 100 కిమీ నడుస్తుంది. ధర ఫేమ్ II సబ్సిడీ (ఎక్స్-షోరూమ్)తో రూ. 99,130.