Page Loader
ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్
2023 సంవత్సరం మధ్యలో వీటి బుకింగ్ లు ప్రారంభమవుతాయి

ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 11, 2023
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైకి చెందిన లిగర్ మొబిలిటీ తన స్కూటర్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. వాటి బుకింగ్‌లు 2023 మధ్యలో ప్రారంభమవుతాయి. AI, IoT తో పనిచేసే మొదటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది . బటన్‌ను నొక్కడం ద్వారా టెక్నాలజీని ఆక్టివేట్/డీయాక్టివేట్ చేయచ్చు. ఈ ద్విచక్ర వాహనాలు రెట్రో-ఫ్యూచరిస్టిక్ రూపంతో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ తో వస్తాయి. X, X+ స్కూటర్లు ఇతర స్కూటర్‌లతో పోల్చితే రైడర్ కు మరింత భద్రత, సౌకర్యాన్ని అందిస్తాయని లిగర్ పేర్కొంది. రెండు వాహనాలు ఫీచర్-లోడ్ చేయబడినవి వీటిని 2025 మధ్యలో విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి చేయాలని సంస్థ ఆలోచిస్తుంది. అవి ఆటో-బ్యాలెన్సింగ్, సాధారణ డ్రైవింగ్ మోడ్‌లతో వస్తాయి. ఆటో-బ్యాలెన్సింగ్ మోడ్ లో తక్కువ వేగంతో నడుస్తుంది.

బైక్

2023 సంవత్సరం మధ్యలో వీటి బుకింగ్ లు ప్రారంభమవుతాయి

ఇందులో 4G, టర్న్-బై-టర్న్ నావిగేషన్, OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ సపోర్ట్‌తో ఆల్-LED లైటింగ్ సెటప్, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో వస్తాయి. ఇవి ఐదు రంగుల్లో లభిస్తాయి. లిగర్ X లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో 65 కి.మీ.వరకు నడిస్తే, X+ ఒక్కో ఛార్జీకి 100కిమీ పవరకు నడుస్తుంది. రైడర్ భద్రత కోసం లిగర్ X, X+ లలో ముందు చక్రంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ అమర్చబడి ఉంటాయి. ఇందులో లెర్నర్ మోడ్, రివర్సింగ్ బటన్ వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. భారతదేశంలో వీటి బుకింగ్‌లు 2023 మధ్యలో ప్రారంభమవుతాయి. డెలివరీలు సంవత్సరం చివరి నాటికి ప్రారంభమవుతాయి. వీటి ధర సుమారు రూ. 90,000 (ఎక్స్-షోరూమ్).