Page Loader
15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక
భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక

15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక

వ్రాసిన వారు Stalin
Jan 09, 2023
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు 'ఓలా ఎలక్ట్రిక్స్ 'ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తమిళనాడులో ఈ పార్క్‌ ఏర్పాటుకు సుమారు 1500 ఎకరాల భూమిని కొనుగోలు చేయబోతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. 1500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌లో.. అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. బ్యాటరీ సెల్‌లను తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గర నుంచి అతర అన్ని రకాల వ్యవస్థలను ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు. దశాబ్దం చివరి నాటికి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌లో లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాలని ఓలా యోచిస్తోంది.

ఓలా

దేశంలో అతిపెద్ద కొనుగోలు

భారతీయ ఆటో సెక్టార్‌లో ఒక కర్మాగార ఏర్పాటు కోసం జరిపిన భూమి కొనుగోళ్లలో ఇదే అతిపెద్దదిగా మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భూమి కొనుగోలుపై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ త్వరలోనే బహిరంగ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఓలా స్కూటర్ మోడళ్లను కూడా పెంచాలని సీఈఓ అగర్వాల్ భావిస్తున్నారు. అలాగే.. తమ కంపెనీ మోటార్‌సైకిళ్లను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. ఇది వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం ఉంది. ఓలా తన తొలి స్కూటర్‌ను గతేడాది విడుదల చేసింది. బెంగళూరులో సొంత ఈవీ టాక్సీ సేవలను ప్రారంభించాలని ఓలా ఎలక్ట్రిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే సంవత్సరంలో బెంగళూరులో ఈవీ టాక్సీల సంఖ్యను 10,000కి పెంచాలని భావిస్తోంది.