Page Loader
భారత రోడ్లపై ALCAZAR ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ రన్.. 3వరుసల SUVకి కంపెనీ రెడి
ఫేస్‌లిఫ్టెడ్ హ్యూందాయ్ అల్కజార్

భారత రోడ్లపై ALCAZAR ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ రన్.. 3వరుసల SUVకి కంపెనీ రెడి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 19, 2023
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

Hyundai Alcazar 2024 Model : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో హ్యుందాయ్​ అల్కజార్ కి మంచి​ డిమాండ్​ ఉంది. ఈ ప్రిమియం​ మోడల్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను త్వరలోనే తీసుకురానుంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్. ఈ మేరకు 2024 రెండో భాగంలో హ్యుందాయ్​ అల్కజార్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను కంపెనీ లాంచ్ చేయనుంది.ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను తెలుసుకుందాం. భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొరియన్ దిగ్గజ వాహన సంస్థ హ్యూందాయ్, ఫేస్‌లిఫ్టెడ్ ALCAZAR మూడు వరుసల SUVని విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇటీవలే కంపెనీ, ఈ కారుకు ముందు, వెనుక భాగానికి సంబంధించిన స్పై షాట్‌లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే కారు నిర్మాణంలో గణనీయమైన మార్పులు జరిగినట్లు వెల్లడించింది.

details

 ఫేస్ లిఫ్ట్ కారులో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)

రీ డిజైన్ చేస్తున్న ఈ కారులో బంపర్‌లు, గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు, టైల్‌లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఉండనుంది. అంతర్గత నవీకరణల శ్రేణితో పాటు అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలు కూడా ఇందులో పొందుపర్చనున్నట్లు వివరించింది. 2024లో రానున్న మోడల్ కోసం మెరుగైన ఫీచర్లతో, కాస్మెటిక్ అప్‌డేట్‌లు, ఫీచర్ రివిజన్‌లతో కారు సిద్ధమవుతోంది. అల్కజార్ ఫేస్ లిఫ్ట్ మోడల్ SUV అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(ADAS), కొత్త అప్హోల్స్టరీ, 360-డిగ్రీ-వ్యూ కెమెరాతో అమర్చబడి ఉండనుంది. ఇప్పటికే రన్నింగ్ మోడల్ లో పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల స్క్రీన్, తొలి రెండు వరుసలో వైర్‌లెస్ ఛార్జర్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), బ్లూలింక్ కనెక్టివిటీ సహా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

details

SUV విభాగంలో హ్యుందాయ్ అల్కజార్ మరింత బలోపేతం

2024 మోడల్ హ్యుందాయ్ ALCAZAR, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజన్ వ్యవస్థలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆరు-స్పీడ్ మాన్యువల్, ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ సహా ఏడు-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌లను అదనంగా ప్రవేశపెటనుంది. పవర్, టార్క్ గణాంకాల పరంగా ఎటువంటి మార్పులు ఉండవు. మూడు-వరుసల SUV విభాగంలో హ్యుందాయ్ అల్కజార్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే రన్నింగ్ మోడల్‌లో పెను మార్పులు చేయనుంది కంపెనీ. భారత ఆటో మార్కెట్లో ఫేస్‌లిఫ్టెడ్ కారు ధరలను వచ్చే ఏడాది చివర్లో వెల్లడించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.