2023 టాటా నెక్సాన్ vs హ్యుందాయ్ వెన్యూ.. బెస్ట్ ఫీచర్స్ ఎందులో ఉన్నాయంటే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త 2023 టాటా నెక్సాన్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త అప్డేట్లతో టాటా నెక్సాన్‌ను తీసుకొచ్చింది.
ఈ వాహనానికి పోటీగా హ్యుందాయ్ సంస్థ మరో ఎస్‌యూవీని లాంచ్ చేసింది.
హ్యుందాయ్ వెన్యూ పేరుతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టి మంచి ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఈ రెండిటి మధ్య ఉన్న ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
కొత్త టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్ లెస్ ట్రిమ్ స్థాయిల్లో అందుబాటులో ఉంది.
2023 టాటా నెక్సాన్‌లో బ్లాక్-అవుట్ గ్రిల్, బంపర్-మౌంటెడ్ ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌లు, సీక్వెన్షియల్ LED DRLలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, 16-అంగుళాల డైమండ్-కట్ వీల్స్ ఉన్నాయి.
Details
హ్యుందాయ్ వెన్యూలో ఆరు ఎయిర్ బ్యాగులు
గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెండవ మోడల్ ఇదే కావడం విశేషం.
హ్యుందాయ్ VENUE పవర్డ్ డ్రైవర్ సీటుతో కూడిన విశాలమైన క్యాబిన్, రెండు-దశల రిక్లైనింగ్ వెనుక సీటు, వాయిస్-నియంత్రిత సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS ఫంక్షన్లను పొందుతుంది.భారతదేశంలో టాటా నెక్సాన్ రూ. రూ. 8.1 లక్షలు నుండి రూ. 13 లక్షల లోపు ఉంది. మరోవైపు, హ్యుందాయ్ VENUE రూ. 7.77 లక్షలు నుంచి రూ. 13.14 లక్షలు వరకు ఉంది.