Hyundai Grand i10 NIOS: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నయోస్ వైబ్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే..
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కొత్తగా హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వైబ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ధర రూ.7.04 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ.7.73 లక్షల వరకు ఉంటుంది. ఇటీవల విడుదలైన హ్యుందాయ్ క్రెటా Creta సమ్మర్ ఎడిషన్ తర్వాత ఈ కొత్త వేరియంట్‌ను కంపెనీ తీసుకువచ్చింది.
వివరాలు
కొత్తగా ఏమి మారింది?
గ్రాండ్ ఐ10 నయోస్ వైబ్ ఎడిషన్‌లో 'టైటన్ గ్రే' అనే కొత్త మ్యాట్ కలర్ ఆప్షన్‌ను అందించారు. ఈ సెగ్మెంట్‌లో మ్యాట్ ఫినిష్ కలర్ అందిస్తున్న ఏకైక మోడల్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఈ వేరియంట్‌లో బ్లాక్ ఇంటీరియర్‌కు రెడ్ హైలైట్స్, బ్లాక్ కలర్ 15 ఇంచ్ అలాయ్ వీల్స్, లెదర్ స్టీరింగ్ వీల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ (రియర్ వెంట్స్‌తో), క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ కూడా అందిస్తున్నారు. భద్రత పరంగా అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా ఇచ్చారు.
వివరాలు
ప్రత్యేక ఆకర్షణ - డ్యాష్‌క్యామ్
ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా డ్యాష్‌క్యామ్‌ను అందించారు. పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇది మొదటిసారిగా అందిస్తున్న ఫీచర్ అని కంపెనీ చెబుతోంది. డ్రైవింగ్, ఎమర్జెన్సీ, ఈవెంట్, వెకేషన్ మోడ్‌లలో వీడియో రికార్డింగ్, ఫోటోలు తీసే సదుపాయం, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ధర రూ.5.55 లక్షల నుంచి రూ.7.91 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండి 83 హెచ్‌పీ పవర్, 113 ఎన్‌ఎం టార్క్ ఇస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లు ఉన్నాయి. సిఎన్‌జీ వేరియంట్‌లో పవర్ 68 హెచ్‌పీకి తగ్గుతుంది. మార్కెట్లో ఈ కారు మారుతీ సుజుకీ స్విఫ్ట్, టాటా టియాగా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తోంది.