Page Loader
టాటా పంచ్ కు పోటీగా మైక్రో SUVను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ ఇండియా

టాటా పంచ్ కు పోటీగా మైక్రో SUVను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ ఇండియా

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 14, 2023
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ 2024 ప్రారంభంలో భారతదేశంలో టాటా పంచ్ (Ai3 అనే సంకేతనామం)కి ప్రత్యర్థిని విడుదల చేయనుంది. కారు పైకప్పు పట్టాలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు ఉన్నాయని ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. భారతదేశంలో మైక్రో-SUVల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. టాటా పంచ్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. హ్యుందాయ్ ఈ డిమాండ్‌ను పసిగట్టింది అందుకే Ai3 మోడల్‌ను రూపొందించే పనిలో పడింది. ప్రస్తుతం, ఈ దక్షిణ కొరియా తయారీసంస్థ భారతదేశంలో VENUE తర్వాత కాంపాక్ట్ SUVని ప్రవేశ పెట్టలేదు. అందువలన, Ai3 మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా సంస్థ అమ్మకాలను పెంచుకోవచ్చు.

కార్

ఇందులో వైర్‌లెస్ వాయిస్ కమాండ్‌ల సపోర్ట్ తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ ఉంది

హ్యుందాయ్ Ai3 1.2-లీటర్, సహజంగా-ఆస్పిరేటెడ్, పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్లుతో నడుస్తుంది. లోపల ఆటో క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్, కీలెస్ ఎంట్రీ, USB ఛార్జర్‌లు, సింగిల్-పేన్ సన్‌రూఫ్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌తో ఉన్న విశాలమైన క్యాబిన్‌ ఉంటుంది. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే,ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్‌ల సపోర్ట్ తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, వెనుక కెమెరా ఉంటాయి. హ్యుందాయ్ భారతదేశంలో Ai3 ధర, ఇతర వివరాలను లాంచ్ చేసే సమయంలో ప్రకటిస్తుంది. అయితే, కారు ప్రారంభ ధర దాదాపు రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండచ్చు.