Page Loader
హ్యుందాయ్ అత్యంత చౌకైన కారుగా ఎక్స్‌టర్‌.. ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.6 లక్షలే
హ్యుందాయ్ అత్యంత చౌకైన కారుగా ఎక్స్‌టర్‌.. ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.6 లక్షలే

హ్యుందాయ్ అత్యంత చౌకైన కారుగా ఎక్స్‌టర్‌.. ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.6 లక్షలే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 11, 2023
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ కంపెనీ, ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ. ఆ కంపెనీ నుంచి కారు వస్తుందంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే ఈసారి సాధారణ, మధ్యతరగతి క్లాస్ లక్ష్యంగా లో రేంజ్ కారును తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఓ సరికొత్త మైక్రో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ)ని భారతీయ వాహన మార్కెట్లోకి తెచ్చింది. ఎంట్రీ లెవల్ మోడల్ ను హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ సోమవారం మార్కెట్లోకి వదిలింది. అల్పాదాయ వర్గాల ప్రజలకు ఈ కారు ధర అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దారు. దిల్లీ ఎక్స్ షోరూం ధర రూ. 5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.

DETAILS

సీఎన్‌జీ ధరను రూ.8.23 లక్షలుగా నిర్ణయించాం : సీఎండీ ఉన్సూ కిమ్

ఎక్స్ టర్ మోడల్ విడుదలతో పూర్తిస్థాయి ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఎండీ ఉన్సూ కిమ్ తెలిపారు. ఈ మోడల్‌ను రూపకల్పన కోసం కంపెనీ రూ.950 కోట్ల మేర పెట్టుబడి పెట్టిందన్నారు. అయితే ఇప్పటివరకు ఇండియన్ ఆటో మార్కెట్లో మొత్తం రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు. తాజాగా రిలీజైన కార్లలో 19.2 కిమీ మైలేజీ ఇచ్చే 5 స్పీడ్‌ ఆటోమెటిక్ మోడల్ ధరను రూ. 7.96 లక్షలుగా ఫిక్స్ చేసినట్లు కిమ్ అన్నారు. అత్యధికంగా 27.1 కిమీ మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ ధరను రూ.8.23 లక్షలుగా నిర్ణయించామన్నారు. టాటా పంచ్‌కు పోటీగా 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన మోడల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసినట్లు చెప్పారు.