Loading...
Hyundai Motor Group: మోదీతో హ్యుందాయ్ ఛైర్మన్ భేటీ.. .. భారత్‌లో రూ.1.37 లక్షల కోట్ల పెట్టుబడి
మోదీతో హ్యుందాయ్ ఛైర్మన్ భేటీ.. .. భారత్‌లో రూ.1.37 లక్షల కోట్ల పెట్టుబడి

Hyundai Motor Group: మోదీతో హ్యుందాయ్ ఛైర్మన్ భేటీ.. .. భారత్‌లో రూ.1.37 లక్షల కోట్ల పెట్టుబడి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్‌లో భారీ పెట్టుబడికి సిద్ధమైంది. 2026 నుంచి 2032 మధ్య భారత్‌లో 15.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.37 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఈయిసన్ చుంగ్ అక్టోబర్ 13, 2026న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన చేశారు. భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచడం, పరిశోధన, అభివృద్ధి, విడిభాగాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, భవిష్యత్ వాహన సాంకేతికతలను అభివృద్ధి చేయడం ఈ పెట్టుబడుల ప్రధాన లక్ష్యాలు.

వివరాలు 

పరిశోధన, అభివృద్ధికి భారీ పెట్టుబడులు

భవిష్యత్ వృద్ధికి భారత్ కీలక మార్కెట్‌గా ఉంటుందని హ్యుందాయ్ వెల్లడించింది.

పెట్టుబడుల నిర్వహణ, భాగస్వామ్య సంస్థలతో ఒప్పందాలు, స్థానిక సరఫరాదారుల అభివృద్ధి కోసం భారత్‌లో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, దేశీయంగా విడిభాగాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వనుంది.

తద్వారా వాహనాల ఉత్పత్తి పెరగడంతో పాటు, భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు కూడా బలోపేతం కానున్నాయి.

భారత్‌లోని పరిశోధన, అభివృద్ధి విభాగాల కోసం దాదాపు 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ.6,200 కోట్లు) పెట్టుబడి పెట్టాలని సంస్థ నిర్ణయించింది.

ఇందులో వాహన పరీక్షల ట్రాక్ ఏర్పాటు కూడా ఉంది.

వివరాలు 

కొత్త పెట్టుబడులతో ఉద్యోగాలు, ఎగుమతులకు ఊతం

కొత్త తరం వాహన సాంకేతికతల అభివృద్ధి, స్థానిక నిపుణులకు అవకాశాలు కల్పించడం ఈ పెట్టుబడుల లక్ష్యాలు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు, వాహన రుణాలు, పాత వాహనాల రీసైక్లింగ్, మొబిలిటీ సేవల్లోనూ అవకాశాలను పరిశీలించనుంది.

ప్రస్తుతం భారత్‌లో హ్యుందాయ్, కియా సంస్థల్లో కలిపి 24,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఈ రెండు సంస్థలకు కలిపి ఏడాదికి 14 లక్షలకు పైగా వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.

కొత్త పెట్టుబడులతో తయారీ, ఇంజినీరింగ్, విడిభాగాల రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

ప్రపంచ ఆటోమొబైల్ తయారీ, సాంకేతిక అభివృద్ధి, ఎగుమతుల కేంద్రంగా భారత్‌ను మరింత బలోపేతం చేయడమే ఈ పెట్టుబడుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

ADVERTISEMENT