TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్‌ను విక్రయించిన టీవీఎస్
దేశీయ మోటార్‌సైకిల్ తయారీదారు టీవీఎస్(TVS) మోటార్ కంపెనీ ఆగస్టులో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. ముఖ్యంగా iQube మోడల్స్ ఎలక్ట్రిక్ బైక్ విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైంది. టీవీఎస్ ఈ ఏడాది ఆగస్టులో 23,887 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఆగస్టులో 4,418 యూనిట్లను మాత్రమే అమ్మింది. iQube ఎలక్ట్రిక్ స్కూటర్ జనాదరణ దాని స్టైలిష్ లుక్, సరసమైన ధరల్లో లభించడం వల్లే విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది. పండుగల సీజన్ సమీపిస్తున్నందున, రాబోయే నెలల్లో మరింత మెరుగైన అమ్మకాల గణాంకాలు నమోదవుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. iQube స్కూటర్ ప్రాక్టికల్ డిజైన్, సామర్థ్యం గల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఫీచర్లు వినియోగదారులను బాగా ఆకర్శిస్తున్నారు.
ఒకసారి ఛార్జింగ్ పెడితే 100కిలోమీటర్లు వెళ్లొచ్చు..
iQube ఎలక్ర్టిక్ బైక్ జీరో ఉద్గారాలను వెలువరించడం ద్వారా, పర్యావరణ అనుకూల వాహనంగా పేరుంది. పర్యావరణ ప్రేమికులు ఈ వాహనం చాయిస్‌గా నిలుస్తుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ అయినప్పటికీ, పెట్రోల్ స్కూటర్‌ను పోలి ఉంటుంది. అందుకే భారతీయ మార్కెట్లో ఈ బైక్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. 4.4kW హబ్-మౌంటెడ్ మోటారు, 3.04kWh బ్యాటరీ ప్యాక్ దీని సొంతం. అలాగే, ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే 100కిమీల దూరం వెళుతుంది. పైగా దీనికి నిర్వహణ ఖర్చు కూడా చా తక్కువ. ఈ వాహనం ఛార్జ్ చేయడానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతుంది. LED లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఈ బైక్ సొంతం.