Page Loader
భారత్‌లో 6,500 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అమ్మకాలు 
భారత్‌లో 6,500 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అమ్మకాలు

భారత్‌లో 6,500 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అమ్మకాలు 

వ్రాసిన వారు Stalin
Feb 25, 2024
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటో మేకర్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్.. 2023 నవంబర్సలో హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450) మోటార్‌సైకిల్‌లను భారత్‌లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ బైక్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 6,500 కొత్త హిమాలయన్ 450 మోటార్‌సైకిల్‌లను విక్రయించినట్లు సీఈఓ బి.గోవిందరాజన్ తెలిపారు. డిమాండ్‌కు అనుగూనంగా బైక్ ఉత్పత్తిని దశలవారీగా పెంచనున్నట్లు వెల్లడించారు. త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో డెలివరీలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తున్నందున ఉత్పత్తిని పెంచుతున్నట్లు గోవిందరాజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హిమాలయన్ 450 బుకింగ్‌ల సంఖ్యను ఆయన వెల్లడించనప్పటికీ.. కొత్త హిమాలయన్‌ బైక్‌పై చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నట్లు చెప్పారు.

బైక్

బైక్ ఫీచర్లు ఇవే

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 పూర్తిగా K-ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. 450cc లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 'షెప్రా' ఇంజన్‌ ఈ మోడల్ సొంతం. K-ప్లాట్‌ఫాం కింద వచ్చే బైక్‌లు పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. J-సిరీస్ చిన్న, సరసమైన 350 cc బైక్‌ను అప్ గ్రేడ్ చేసి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మోడల్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఈ బైక్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 4-అంగుళాల రౌండ్ షేప్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, Google Maps ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, రైడ్-బై-వైర్, 2 రైడింగ్ మోడ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.