Loading...
Independence Day 2026: భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Independence Day 2026: భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా ఈ రోజును నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే భారత స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం..

1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది.

జవహర్‌లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

స్వాతంత్య్రానికి ముందు రోజు ఆయన 'ట్రిస్ట్ విత్ డెస్టినీ' పేరుతో ప్రసిద్ధ ప్రసంగం చేశారు.

వివరాలు

జపాన్‌కు కూడా ఆగస్టు 15 కీలకమైన రోజే..

భారత్ స్వాతంత్ర దినోత్సవంగా ఆగస్టు 15ను ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945 ఆగస్టు 15న జపాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించింది.

అప్పటి భారత చివరి వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్‌కు కూడా ఈ తేదీతో సంబంధం ఉంది.

ఆ సమయంలో ఆయన ఆగ్నేయాసియాలో మిత్రదేశాల సుప్రీం కమాండర్‌గా వ్యవహరించారు.

చివరకు ఆగస్టు 15నే భారత స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్ణయించారు.

ADVERTISEMENT

వివరాలు

జాతీయ జెండా అధికారికంగా ఆమోదం..

భారత జాతీయ జెండాను 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.

అంటే స్వాతంత్య్రం రావడానికి కొన్ని వారాల ముందే ప్రస్తుత జాతీయ జెండాకు అధికారిక ఆమోదం లభించింది.

జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మూడు అడ్డ పట్టీలు ఉంటాయి. మధ్యలో 24 ఆకులతో కూడిన అశోక చక్రం ఉంటుంది.

1947 ఆగస్టు 15న ఢిల్లీలో లేని మహాత్మా గాంధీ:

1947 ఆగస్టు 15న ఢిల్లీలో జరిగిన ఘనమైన స్వాతంత్ర్య వేడుకలకు మహాత్మా గాంధీ హాజరు కాలేదు.

ఆ సమయంలో ఆయన కలకత్తాలో ఉన్నారు. మతపరమైన హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడ శాంతిని నెలకొల్పేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

ADVERTISEMENT