Loading...
Cristiano Ronaldo: 'ఔను..వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు'.. రొనాల్డో షాకింగ్ పోస్ట్
'ఔను..వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు'.. రొనాల్డో షాకింగ్ పోస్ట్

Cristiano Ronaldo: 'ఔను..వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు'.. రొనాల్డో షాకింగ్ పోస్ట్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

పోర్చుగల్ ఫుట్‌ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఓ ఇంటివాడయ్యాడు. గత కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న తన ప్రియురాలు, 32 ఏళ్ల జార్జినా రోడ్రిగ్స్‌ను రొనాల్డో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. పెళ్లి ఉంగరాలను చూపిస్తూ జార్జినాతో కలిసి దిగిన ఫొటోను రొనాల్డో పోస్ట్ చేశాడు. తన పేరు 'సి', జార్జినా పేరు 'జే' అక్షరాల మధ్య లవ్ సింబల్‌ను క్యాప్షన్‌గా పెట్టాడు. ఈ పోస్ట్‌కు కేవలం ఏడు గంటల్లోనే 17.1 మిలియన్ల లైకులు రావడం విశేషం.

వివరాలు

సోషల్ మీడియాలో వెల్లడి..

అర్జెంటీనా-స్పానిష్ మోడల్ జార్జినా రోడ్రిగ్స్‌తో 41 ఏళ్ల రొనాల్డో దాదాపు పదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.

గతంలో వీరిద్దరి పెళ్లిపై ఎన్నోసార్లు వార్తలు, రూమర్లు వచ్చాయి. అయితే వాటిపై రొనాల్డో, జార్జినా ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు.

తాజాగా సోషల్ మీడియాలో అధికారికంగా పెళ్లి విషయాన్ని వెల్లడించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.

వివరాలు

ఐదుగురు పిల్లల తండ్రి..

రొనాల్డో తొలిసారి జార్జినాను 2016లో కలిశాడు. ఆ తర్వాత ఏడాదికే తమ అనుబంధం గురించి బయట ప్రపంచానికి వెల్లడించాడు.

మొదట్లో తమ రిలేషన్‌షిప్ ఇంతగా బలపడుతుందని తాను అనుకోలేదని రొనాల్డో చెప్పాడు.

అయితే రోజులు గడిచేకొద్దీ జార్జినాతో ప్రేమలో పడిపోయానని వెల్లడించాడు.

ఈ విషయాలను నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన 'ఐ యామ్ జార్జినా' సిరీస్‌లో రొనాల్డో వివరించాడు. రొనాల్డోకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు.

ADVERTISEMENT