Loading...
Karthika Deepam : కార్తీక దీపంపై సుప్రీంకోర్టు ఆర్డర్ ను సవాల్ చేసిన విజయ్
కార్తీక దీపంపై సుప్రీంకోర్టు ఆర్డర్ ను సవాల్ చేసిన విజయ్

Karthika Deepam : కార్తీక దీపంపై సుప్రీంకోర్టు ఆర్డర్ ను సవాల్ చేసిన విజయ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

మదురైలోని ప్రసిద్ధ తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం సవాల్‌ చేసింది. ఈ ఉత్తర్వులను మరోసారి పరిశీలించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మంగళవారం కార్తీక దీపం వెలిగించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం తమిళనాడు రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

ఆలయ సంప్రదాయాలు, శాంతిభద్రతలపై ప్రభుత్వ ఆందోళన

రివ్యూ పిటిషన్‌లో తమిళనాడు ప్రభుత్వం ప్రధానంగా ఆలయ సంప్రదాయాలు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.

తరతరాలుగా కార్తీక దీపాన్ని ఆలయ ప్రాంగణంలోనే వెలిగిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.

తిరుపరకుండ్రం కొండపై వివాదాస్పదంగా ఉన్న హజ్రత్‌ దర్గా సమీపంలోని ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించే సంప్రదాయం గతంలో ఎప్పుడూ లేదని స్పష్టం చేసింది.

దర్గా సమీపంలో కొత్తగా దీపం వెలిగించేందుకు అనుమతిస్తే స్థానికంగా మతపరమైన సున్నితత్వాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

దీనివల్ల ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తవచ్చని పిటిషన్‌లో వివరించింది.

ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని కోరింది.

ADVERTISEMENT