Loading...
Andrew flintoff: శతక్కొట్టిన ఇంగ్లండ్‌ దిగ్గజం కుమారుడు.. తండ్రికి తగ్గ తనయుడే!
శతక్కొట్టిన ఇంగ్లండ్‌ దిగ్గజం కుమారుడు.. తండ్రికి తగ్గ తనయుడే!

Andrew flintoff: శతక్కొట్టిన ఇంగ్లండ్‌ దిగ్గజం కుమారుడు.. తండ్రికి తగ్గ తనయుడే!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్‌ అదరగొట్టాడు. తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నాడు. వన్డే కప్‌లో భాగంగా లంకాషైర్‌ తరఫున బరిలోకి దిగిన రాకీ.. అద్భుత శతకంతో మెరిశాడు. కేవలం 76 బంతుల్లోనే 123 పరుగులు చేసి సత్తా చాటాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. త్వరలోనే ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ సెలెక్టర్లకు గట్టి సందేశం పంపించాడు. లంకాషైర్‌, సోమర్‌సెట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాకీ ఫ్లింటాఫ్‌ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సీనియర్‌ జట్టు తరఫున ఇదే అతడి తొలి శతకం కావడం విశేషం.

వివరాలు

174 పరుగులతో భారీ విజయం..

రాకీ ఫ్లింటాఫ్‌, ఓపెనర్‌ కీటన్‌ జెన్నింగ్స్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో లంకాషైర్‌.. సోమర్‌సెట్‌పై 174 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన లంకాషైర్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 443 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఓపెనర్‌ కీటన్‌ జెన్నింగ్స్‌ 127 బంతుల్లో 156 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

మరోవైపు రాకీ ఫ్లింటాఫ్‌ 76 బంతుల్లో 123 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

మాటీ హస్ట్‌ 47 పరుగులు చేయగా.. చివర్లో జాక్‌ బ్లాథర్‌విక్‌ కేవలం 10 బంతుల్లోనే 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లంకాషైర్‌ స్కోరును 400 దాటించాడు.

వివరాలు

వాళ్లిద్దరికీ చెరో నాలుగు వికెట్లు..

సోమర్‌సెట్‌ బౌలర్లలో మిగెల్‌ ప్రిటోరియస్‌, ఆర్చీ వాగన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్‌సెట్‌ 39.2 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌటైంది.

టామ్‌ లామ్మోబి 68 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జోషువా థామస్‌ 42, జోష్‌ షా 34 పరుగులు చేశారు.

భారీ లక్ష్యం ముందుండటంతో ఒత్తిడికి లోనైన సోమర్‌సెట్‌ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు.

లంకాషైర్‌ బౌలర్లలో టామ్‌ ఆస్పిన్‌వాల్‌, జార్జ్‌ బాల్డర్‌సన్‌ చెరో నాలుగు వికెట్లు తీసి సోమర్‌సెట్‌ పతనాన్ని శాసించారు.

ADVERTISEMENT

వివరాలు

ఫ్లింటాఫ్‌ అనగానే గుర్తొచ్చేది అదే..

ఆండ్రూ ఫ్లింటాఫ్‌ పేరు వినగానే భారత క్రికెట్‌ అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్‌ సింగ్‌ కొట్టిన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లే.

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు.

అంతకుముందు తన చేష్టలతో యువరాజ్‌ను రెచ్చగొట్టిన ఫ్లింటాఫ్‌కు.. యువరాజ్‌ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

అయితే ఫ్లింటాఫ్‌పై ఉన్న కోపాన్ని యువరాజ్‌.. ఆ తర్వాతి ఓవర్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌పై చూపించాడు.

బ్రాడ్‌ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా ఆరు బంతులను ఆరు సిక్సర్లుగా మలిచిన యువరాజ్‌.. ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు.

ఫ్లింటాఫ్‌తో జరిగిన ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నట్టుగా యువరాజ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ అభిమానుల మదిలో ఇప్పటికీ చెరిగిపోని జ్ఞాపకంగా నిలిచిపోయింది.

ADVERTISEMENT