Page Loader
Tesla: త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నటెస్లా.. దిల్లీలో షోరూమ్‌ కోసం ప్రయత్నాలు
త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్న టెస్లా.. దిల్లీలో షోరూమ్‌ కోసం ప్రయత్నాలు

Tesla: త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నటెస్లా.. దిల్లీలో షోరూమ్‌ కోసం ప్రయత్నాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

టెస్లా (Tesla) దిల్లీలో తన షోరూమ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు వేగంగా జరుపుతోంది. అమెరికాకు చెందిన ఒక వార్తా సంస్థ ప్రకారం, టెస్లా ఇప్పటికే రాజధానిలో షోరూమ్ కోసం స్థలం వెతుకుతోంది. దీనికి సంబంధించి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొదట,ఈ ఏడాది ప్రారంభంలో,టెస్లా భారత్‌లో పెట్టుబడులు పెట్టే ప్రణాళికను వాయిదా వేసినప్పటికీ, ఇప్పుడు తిరిగి పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో, ఎలాన్ మస్క్ (Elon Musk) భారత్ పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ అవ్వాలని సూచించారు, ఆ సమయంలో ₹25 వేల కోట్ల పెట్టుబడుల గురించిన ప్రచారం కూడా జరిగింది. కానీ,తరువాత టెస్లా విక్రయాలు తగ్గడం,కంపెనీ సిబ్బందిలో 10శాతం మందిని తొలగించడం,వాటి కారణంగా పెట్టుబడుల ప్రణాళికను పక్కన పెట్టాల్సి వచ్చింది.

వివరాలు 

 టెస్లాకి దాదాపు 3,000 నుంచి 5,000 చదరపు మీటర్ల స్థలం 

తాజాగా, టెస్లా దిల్లీలో షోరూమ్‌ను ప్రారంభించడానికి దొరుకుతున్న స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, డీఎల్‌ఎఫ్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు మిగిలిన రియల్ ఎస్టేట్ దిగ్గజాలతో కూడా కొనసాగుతున్నాయి. టెస్లా దాదాపు 3,000 నుంచి 5,000 చదరపు మీటర్ల స్థలం కోసం ప్రయత్నిస్తోంది. ఈ స్థలంలో కన్జ్యూమర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, మూడు రెట్ల స్థలాన్ని డెలివరీ, సర్వీస్ సెంటర్ల కోసం ఉపయోగించాలని ఆ సంస్థ భావిస్తోంది. దక్షిణ దిల్లీలోని డీఎల్‌ఎఫ్‌ అవెన్యూ మాల్‌, సైబర్ హబ్ ఆఫీస్, గురుగ్రామ్‌లోని రిటైల్ కాంప్లెక్స్‌లు దానికి పరిశీలనలో ఉన్నాయి.

వివరాలు 

అవెన్యూ మాల్‌లో బ్రాండ్ల ఔట్‌లెట్లు

అవెన్యూ మాల్‌లో ఇప్పటికే యూనిక్లో (జపాన్), మ్యాంగో (స్పెయిన్), మార్క్స్ అండ్ స్పెన్సర్ (బ్రిటన్) వంటి బ్రాండ్ల ఔట్‌లెట్లు ఉన్నాయి, అక్కడ దాదాపు 8,000 చదరపు అడుగుల స్థలం ఉంది. ఈ విషయంపై టెస్లా,డీఎల్‌ఎఫ్‌ సంస్థలు ఇప్పటివరకు స్పందించలేదు. ఇక, భారత్‌లో టెస్లా 100 శాతం పన్ను రేటు చెల్లించి కార్లను దిగుమతి చేసుకొని విక్రయిస్తుందా లేదా కొత్త విధానం ప్రకారం 15 శాతం పన్ను చెల్లించి కార్లను దేశంలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంటుందా అనే అంశంపై స్పష్టత లేదు.