రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోలిస్తే JAWA 42 ఎందులో బెటర్
JAWA మోటార్‌సైకిల్స్ ఇటీవల భారతదేశంలో 42 మోడల్‌కు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కొత్త మెటాలిక్ కాస్మిక్ కార్బన్ కలర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెట్రో బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కు సబ్-400cc కేటగిరీలో పోటీగా ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడూ రెట్రో స్టైల్ ను అనుకరిస్తుంది. Machismo స్థానంలో క్లాసిక్ 350 మోడల్‌ను 2009లో విడుదల చేసింది. అయితే, దీనికి పోటీగా ఇప్పుడు JAW 42, Yezdi రోడ్‌స్టర్ మోడల్‌ల మార్కెట్లోకి వచ్చాయి. రైడర్ భద్రత కోసం JAWA 42లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
ట్రెండింగ్ నియో-రెట్రో స్టైల్ తో మార్కెట్ లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న JAWA 42
JAWA 42 293cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 349cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ మోటారు తో నడుస్తుంది. JAWA 42లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వస్తే, రెండోది 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ తో వస్తుంది. భారతదేశంలో, JAWA 42 ధర రూ. 1.94 లక్షలు నుండి రూ. 2.17 లక్షల వరకు అందుబాటులో ఉంది, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 రూ. 1.9 లక్షల నుండి రూ. 2.21 లక్షల (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. JAWA 42 రాయల్ ఎన్‌ఫీల్డ్ తో పోలిస్తే ట్రెండింగ్ నియో-రెట్రో స్టైల్ తో ఆకర్షణీయంగా కనిపించడమే కాదు శక్తివంతమైన ఇంజన్ తో వస్తుంది.