2022లో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల్లో రికార్డ్
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ అమ్మకాలు 2022 సంవత్సరంలో భీభత్సంగా పెరిగాయి. కానీ అదే టైమ్ లో 2022 డిసెంబర్ లో మాత్రం తగ్గాయి. 2021 డిసెంబర్ లోని అమ్మకాలతో పోల్చితే 2022లో అమ్మకాలు తగ్గినట్లు కనిపిస్తోంది. 2022 డిసెంబర్ లో 59,821 బైక్ లు అమ్ముడైతే 2021 డిసెంబర్ లో 65,187 బైక్స్ అమ్ముడయ్యాయి. పైన చెప్పినవి కేవలం దేశీయ అమ్మకాలు మాత్రమే. ఎగుమతుల్లో మాత్రం 2021 డిసెంబర్ తో(8552 యూనిట్లు) పోల్చితే 2022 డిసెంబర్ లో (8579 యూనిట్లు) ఎక్కువ అమ్మకాలు జరిగాయి. దేశీయ అమ్మకాలు, ఎగుమతులను కలుపుకుంటే 2022 చివరి నెలలో 68,400 యూనిట్లు, 2021 చివరి నెలలో 73,739 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
2022 సవత్సరంలో 28శాతం పెరిగిన అమ్మకాలు
ఐతే 2022సంవత్సరం మొత్తంలో జరిగిన అమ్మకాలు 2021తో పోల్చితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 2021లో కేవలం 5,50,557 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 2022లో 7,03166 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో దాదాపు 28శాతం అమ్మకాలు పెరిగినట్లు అర్థమవుతోంది. కరోనా తర్వాత ఈ రేంజ్ లో అమ్మకాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. 2022 అక్టోబర్ నెలలో అమ్మకాలు హై లెవెల్ కి చేరిపోయాయి. 80వేలకు పైగా యూనిట్ల అమ్మకాలు ఒక్క నెలలోనే జరగడం విశేషం. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈవో మాట్లాడుతూ, ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉందని, ఇది అందరిలోనూ ఉత్సాహాన్ని నింపిందని, ఎగుమతుల్లో కూడా అమ్మకాలు బాగా పెరిగాయని అన్నారు.