Loading...
Honda Nissan partnership: హోండా-నిస్సాన్ కీలక ఒప్పందం.. భవిష్యత్ కార్లలో సరికొత్త టెక్నాలజీ!
హోండా-నిస్సాన్ కీలక ఒప్పందం.. భవిష్యత్ కార్లలో సరికొత్త టెక్నాలజీ!

Honda Nissan partnership: హోండా-నిస్సాన్ కీలక ఒప్పందం.. భవిష్యత్ కార్లలో సరికొత్త టెక్నాలజీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు 'నిస్సాన్‌, హోండా' కీలక ఒప్పందం చేసుకున్నాయి. భవిష్యత్‌లో రానున్న సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్స్ (SDVs)లో ఉపయోగించే కీలక ఎలక్ట్రానిక్‌, సాఫ్ట్‌వేర్‌ భాగాలను ప్రామాణీకరించేందుకు (Standardisation) రెండు సంస్థలు చేతులు కలిపాయి. ఇందుకోసం ఉమ్మడి అభివృద్ధి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా పలు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు (ECUs), వాహనంలో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్‌, కొన్ని మిడిల్‌వేర్‌ భాగాలు, వెహికల్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌ను రెండు కంపెనీలు కలిసి అభివృద్ధి చేయనున్నాయి. భవిష్యత్‌ SDVలకు అవసరమైన ప్రాథమిక సాంకేతిక వ్యవస్థకు ఇవి పునాదిగా నిలవనున్నాయి.

వివరాలు

2029 నుంచి కొత్త కార్లలో..

ఉమ్మడిగా అభివృద్ధి చేసే టెక్నాలజీలను నిస్సాన్‌, హోండా భవిష్యత్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ (E/E) ఆర్కిటెక్చర్‌లో అనుసంధానించనున్నాయి.

ఆ తర్వాత 2029 ఆర్థిక సంవత్సరం నుంచి రెండు కంపెనీలు తీసుకురానున్న తదుపరి తరం SDVల్లో వీటిని ఉపయోగించేందుకు ప్రణాళిక రూపొందించాయి.

నిస్సాన్‌, హోండా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఒప్పందం మరింత బలాన్నివ్వనుంది.

వాహనాల ఎలక్ట్రిఫికేషన్‌, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, కార్బన్‌ న్యూట్రాలిటీకి సంబంధించిన టెక్నాలజీలు, రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలను తగ్గించే సాంకేతికతలపై రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.

వివరాలు

ఖర్చులు తగ్గించడమే లక్ష్యం

ఆధునిక వాహనాల్లో సాఫ్ట్‌వేర్‌ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో SDV టెక్నాలజీని సహకారానికి కీలక రంగంగా రెండు సంస్థలు గుర్తించాయి.

సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలో కలిసి పనిచేసే అవకాశాలను కొంతకాలంగా పరిశీలించిన నిస్సాన్‌, హోండా.. వాహనాల కీలక ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌కు ఉమ్మడి విధానాన్ని అవలంబించడం ద్వారా అభివృద్ధి ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చుకోవచ్చని భావించాయి.

ఈ ఒప్పందంలో భాగంగా పలు ECUsతో పాటు ఇన్-వెహికల్ ఆపరేటింగ్ సిస్టమ్‌, ఎంపిక చేసిన మిడిల్‌వేర్‌ భాగాలు, వెహికల్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌కు ఉమ్మడి స్పెసిఫికేషన్లను రూపొందించనున్నాయి.

ఈ టెక్నాలజీలను ప్రామాణీకరించడం ద్వారా అభివృద్ధి వనరులను పరస్పరం పంచుకోవడం, పెట్టుబడి అవసరాలను తగ్గించడం, భారీ స్థాయిలో ఉత్పత్తి ద్వారా స్కేల్‌ ఎకానమీస్‌ సాధించడం నిస్సాన్‌, హోండా లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ADVERTISEMENT