LOADING...
Kia EV2:  కియా EV2 ఎలక్ట్రిక్ SUV యూరప్‌లో లాంచ్.. ఫీచర్లు,రేంజ్,ధర వివరాలు

Kia EV2:  కియా EV2 ఎలక్ట్రిక్ SUV యూరప్‌లో లాంచ్.. ఫీచర్లు,రేంజ్,ధర వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆటోమొబైల్ దిగ్గజం కియా తన కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన కియా EV2ను యూరప్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ SUV నాలుగు, ఐదు సీట్ల ఎంపికల్లో అందుబాటులో ఉండటం ప్రత్యేకతగా నిలిచింది. డిజైన్, టెక్నాలజీ పరంగా ఆధునిక ఫీచర్లతో ఈ వాహనం వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ SUVలో LED హెడ్‌లైట్లు, LED DRLలు, 360-డిగ్రీ కెమెరా,రూఫ్ రైల్స్, పార్కింగ్ సెన్సార్లు,ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటి ఎక్స్‌టీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

వివరాలు 

బ్యాటరీ, పనితీరు వివరాలు

అంతేకాకుండా వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ వంటి ఆధునిక ఇంటీరియర్ సౌకర్యాలు కూడా ఇందులో పొందుపరిచారు. భద్రత పరంగా ABS, EBD, ADAS వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కియా EV2ను 42.2 kWh మరియు 61 kWh బ్యాటరీ ఆప్షన్‌లతో అందిస్తున్నారు. ఈ వాహనం గరిష్టంగా 413 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 146 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేయగలదు.

వివరాలు 

వేరియంట్ ధరలు 

ధరల విషయానికి వస్తే, ఈ SUV యూరప్‌లో ప్రారంభ ధర 26,600 యూరోలు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.29 లక్షల వరకు ఉంటుంది. ఇక టాప్ వేరియంట్ ధర 33,490 యూరోలు కాగా, ఇది దాదాపు రూ.36.52 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం కియా కంపెనీ భారతదేశంలో తన ఐసిఇ (ICE) మోడల్ అయిన కియా సైరోస్‌ను విక్రయిస్తోంది. అయితే కియా EV2ను భారత్‌లో విడుదల చేసే విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్‌లో ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement