Konarc: భారత్‌లో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా 'కొనార్క్'.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ.. భారత్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'కొనార్క్'ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.99,999గా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన EL ప్లాట్‌ఫామ్‌పై తయారైన తొలి ప్రొడక్షన్ స్కూటర్ ఇదే కావడం విశేషం. కేవలం పనితీరుపైనే కాకుండా.. అందుబాటు ధర, సులభమైన సర్వీసింగ్, సౌకర్యవంతమైన ఛార్జింగ్, రోజువారీ వినియోగానికి అనువుగా ఉండేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు ఏథర్ తెలిపింది.
వివరాలు
ధర ఎంత?
కొనార్క్‌ను S, Z అనే రెండు లైన్లలో ఏథర్ అందిస్తోంది. ఇందులో వివిధ రేంజ్ ఆప్షన్లు ఉన్నాయి.
100 కిలోమీటర్ల IDC రేంజ్ అందించే బేస్ వేరియంట్ 'కొనార్క్ S' ధర రూ.99,999గా ఉంది.
125 కిలోమీటర్ల రేంజ్ వెర్షన్ ధర రూ.1,21,999 కాగా.. 161 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ధర రూ.1,44,999గా నిర్ణయించారు.
200 కిలోమీటర్ల రేంజ్ కలిగిన కొనార్క్ Sతో పాటు రెండు Z వేరియంట్ల ధరలను ఏథర్ ఇంకా ప్రకటించలేదు. పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలే.
వివరాలు
డెలివరీలు ఎప్పటి నుంచి?
కొనార్క్ డెలివరీలను దశలవారీగా ప్రారంభించనున్నారు. 125 కిలోమీటర్లు, 161 కిలోమీటర్ల రేంజ్ కలిగిన కొనార్క్ S వేరియంట్ల డెలివరీలు 2026 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఎంట్రీ లెవల్ 100 కిలోమీటర్ల వేరియంట్ 2027 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రానుంది.
ఇక 200 కిలోమీటర్ల రేంజ్ కలిగిన S వేరియంట్ 2027 మూడో త్రైమాసికంలో మార్కెట్లోకి రానుంది.
రెండు Z వేరియంట్లు వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో విడుదల కానున్నాయి.
S లైన్‌లో ఐదు రంగులు, Z లైన్‌లో నాలుగు రంగుల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
వివరాలు
EL ప్లాట్‌ఫామ్ ప్రత్యేకతలు ఇవే..
ఏథర్ కొత్తగా రూపొందించిన EL ప్లాట్‌ఫామ్‌ను వివిధ రకాల స్కూటర్లకు ఉపయోగించుకునేలా స్కేలబుల్ సొల్యూషన్‌గా అభివృద్ధి చేసింది.
ఇందులో ప్రధాన భాగాలను వివిధ మోడళ్లలోనూ పంచుకునే విధంగా డిజైన్ చేశారు.
2.6 మిలియన్ కిలోమీటర్ల ఫీల్డ్ డేటాను ఆధారంగా చేసుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఇందులో కొత్త ఛాసిస్, పవర్‌ట్రెయిన్, ఎలక్ట్రానిక్స్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి.
భాగాల సంఖ్యను తగ్గించడం ద్వారా స్కూటర్ అసెంబ్లీ ప్రక్రియ 15 శాతం వేగంగా పూర్తవుతుందని ఏథర్ చెబుతోంది.
అలాగే సాధారణ సర్వీసింగ్ సమయం కూడా రెండు రెట్ల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
కొనార్క్ డిజైన్, ఫీచర్లు..
కొనార్క్‌లో 14 అంగుళాల ఫ్రంట్ వీల్‌ను అందించారు. గుంతలు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై మెరుగైన హ్యాండ్లింగ్ కోసం ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
1,352 మిల్లీమీటర్ల వీల్‌బేస్ ఉండటం వల్ల స్కూటర్‌కు మరింత స్థిరత్వం లభిస్తుంది.
కొనార్క్‌ను ఫ్యామిలీ స్కూటర్ తరహా క్యారెక్టర్‌తో రూపొందించారు.
నేరుగా ప్రయాణించేటప్పుడు స్థిరత్వం, రైడర్‌కు సౌకర్యం, వెనుక కూర్చునే పిలియన్ ప్రయాణికుడికి అనువుగా ఉండటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు.
పిలియన్ రైడర్ సౌకర్యం కోసం ప్యాడెడ్ గ్రాబ్ హ్యాండిల్‌తో పాటు అడ్జస్టబుల్ బ్యాక్‌రెస్ట్‌ను కూడా అందించారు.
వివరాలు
బ్రేకింగ్ పనితీరును మెరుగుపరిచే AeBS..
కొనార్క్‌లోని 125 కిలోమీటర్లు, 161 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్లలో CBSతో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను అందించారు.
దీనికి ఏథర్ Advanced Electronic Braking System (AeBS)ను జోడించింది.
AeBS ద్వారా గరిష్ఠ బ్రేకింగ్ ఫోర్స్ 20 శాతం వరకు పెరుగుతుందని కంపెనీ చెబుతోంది.
అదే సమయంలో బ్రేకింగ్ సమయంలో కంట్రోల్, స్కూటర్ స్థిరత్వం కూడా మెరుగుపడుతుందని పేర్కొంది.
కొనార్క్‌లో 450W ఆన్‌బోర్డ్ ఛార్జింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీంతో ఇంటి బయట ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉన్న ప్రతిసారీ పెద్ద, బరువైన ఛార్జర్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని ఏథర్ తెలిపింది.