Loading...
Lamborghini: లంబోర్గిని కారులో కొత్త స్టైల్.. టెట్టోనెరో టూ-టోన్ డిజైన్ అదుర్స్
లంబోర్గిని కారులో కొత్త స్టైల్.. టెట్టోనెరో టూ-టోన్ డిజైన్ అదుర్స్

Lamborghini: లంబోర్గిని కారులో కొత్త స్టైల్.. టెట్టోనెరో టూ-టోన్ డిజైన్ అదుర్స్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 01, 2026
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకే కారు.. ఐదు ఆకర్షణీయమైన రంగులు.. వాటికి జతగా నలుపు రంగు ప్రత్యేక హంగులు! లంబోర్గిని తన ప్రీమియం సూపర్‌కార్ టెమెరారియోకు కొత్త రూపాన్ని పరిచయం చేసింది. దీనికి టెట్టోనెరో క్యాప్సూల్ అని పేరు పెట్టింది. ఇందులో కారు బయట రూపానికి మాత్రమే మార్పులు చేశారు. ఇంజిన్, పనితీరు, హైబ్రిడ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయినప్పటికీ, కొత్త కలర్ కాంబినేషన్‌తో టెమెరారియో మరింత స్పోర్టీగా, దూకుడుగా కనిపిస్తోంది.

Details

ఐదు రంగులతో ప్రత్యేకమైన టూ-టోన్ స్టైల్

ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ నీరో నోక్టిస్ బ్లాక్ ఫినిష్. కారు బానెట్, రూఫ్‌తో పాటు కొన్ని బయటి భాగాలకు ఈ నలుపు రంగును ఉపయోగించారు.

దీనికి జతగా గియాల్లో ఇంటి, అరాన్సియో జాంటో, బ్లూ సెఫియస్, వెర్డే స్కాండల్, వియోలా పసిఫే అనే ఐదు రంగుల్లో బాడీని ఎంచుకోవచ్చు.

ఫ్రంట్ బంపర్, ఫ్రంట్ స్ప్లిటర్, రియర్ డిఫ్యూజర్, లంబోర్గిని లోగోకు కూడా అదనపు బ్లాక్ యాక్సెంట్స్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

Details 

లోపల కూడా ప్రత్యేకమైన లగ్జరీ టచ్

కారు బయట రంగులకే పరిమితం కాకుండా లోపలి భాగాల్లోనూ ప్రత్యేకత చూపించారు.

నీరో అడే లెదర్ సీట్లకు గ్రిజియో ఆక్టాన్స్ కాంట్రాస్ట్ స్టిచింగ్ ఇచ్చారు. సీట్లపై షడ్భుజి ఆకారంలో ఉండే క్యూ-సిటురా క్విల్టింగ్‌ను కూడా ఎంచుకోవచ్చు.

బయట ఎంచుకున్న రంగుకు అనుగుణంగా ఇంటీరియర్‌లో కొన్ని వివరాలను మార్చుకునే వీలుంది. టెట్టోనెరో క్యాప్సూల్ ప్రత్యేకతను గుర్తుచేసే మ్యాట్ కార్బన్ స్మారక ప్లేట్‌ను కూడా అందిస్తున్నారు.

ADVERTISEMENT

Details

907 హెచ్‌పీ పవర్‌లో మాత్రం మార్పుల్లేవ్

టెమెరారియోలో 4.0 లీటర్ల ట్విన్ టర్బో వీ8 ఇంజిన్‌కు మూడు ఎలక్ట్రిక్ మోటార్లను జత చేశారు. ఈ హైబ్రిడ్ వ్యవస్థ మొత్తం 907 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్ గరిష్ఠంగా 10,000 ఆర్‌పీఎం వరకు తిరిగే సామర్థ్యం కలిగి ఉంది. అంటే కొత్త ఎడిషన్‌లో మారింది కారు రూపమే కానీ, దాని వేగం, ఇంజిన్ సామర్థ్యం కాదు.

2026 మిలాన్ డిజైన్ వీక్‌లో ఉరుస్ ఎస్‌ఈతో తొలిసారి పరిచయమైన టెట్టోనెరో థీమ్‌ను ఇప్పుడు టెమెరారియోకూ విస్తరించారు.

ఇది ప్రత్యేక నంబరింగ్‌తో వచ్చే కొత్త మోడల్ కాదు. సాధారణ టెమెరారియో లైనప్‌లోనే అదనపు వ్యక్తిగతీకరణ ఎంపికగా అందిస్తున్నారు. ఆటో మొబైల్‌ రంగంలో ఈ ఎడిషన్‌ సరికొత్తగా ఆకట్టుకోనుందని నిపుణులు చెబుతున్నారు.

ADVERTISEMENT