
డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్
ఈ వార్తాకథనం ఏంటి
జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 SUVని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది HSE, X అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 3.0-లీటర్, ఆరు-సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో వస్తుంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130ను గతేడాది మేలో ప్రకటించారు. ఇది కంపెనీ ఉత్పత్తి చేసిన పొడవైన డిఫెండర్ మోడల్ అయితే దీని వీల్‌బేస్ దాని డిఫెండర్ 110 మోడల్ లాగానే ఉంటుంది. వాహనం స్టైలిష్ రూపాన్ని, ఫీచర్లతో కస్టమర్‌లను ఆకట్టుకుంటుంది. లగ్జరీ SUV సెగ్మెంట్లో పోటీ తప్పకుండా పెరుగుతుంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130లో 'డిఫెండర్' అక్షరాలతో డిజైన్ చేసిన బానెట్ ఉంది. ఇది 3.0-లీటర్, ఆరు-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇందులో మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది.
కార్
డిఫెండర్ 130 SUVలో ప్రయాణీకుల భద్రత కోసం సరౌండ్-వ్యూ కెమెరా
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130లో విశాలమైన ఎనిమిది-సీట్ల క్యాబిన్, పనోరమిక్ సన్‌రూఫ్, నాలుగు-జోన్ క్లైమేట్ కంట్రోల్, 14-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఇందులో మెరిడియన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్,11.4-అంగుళాల Pivi Pro టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం సరౌండ్-వ్యూ కెమెరా, ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
భారతదేశంలో, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 బేస్ HSE (పెట్రోల్) మోడల్ ప్రారంభ ధర రూ.1.3 కోట్లు, సిరీస్-టాపింగ్ X (డీజిల్) వేరియంట్ రూ. 1.41 కోట్లు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).