LOADING...
భారత మార్కెట్‌లో BMW X5 విడుదల; ధర రూ.93.90లక్షలు

భారత మార్కెట్‌లో BMW X5 విడుదల; ధర రూ.93.90లక్షలు

వ్రాసిన వారు Stalin
Jul 15, 2023
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ వాహనాల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా '2023 BMW X5' మోడల్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది. బీఎండబ్ల్యూ రెండు రకాల్లో '2023 BMW X5'ను తీసుకొచ్చింది. ఒకటి ఎక్స్ లైన్(xLine) కాగా, రెండోది ఎమ్ స్పోర్ట్(M Sport). ఫేస్‌లిఫ్టెడ్ X5 ప్రారంభ ధరను రూ.93.90 లక్షల(ఎక్స్-షోరూమ్)గా కంపెనీ పేర్కొంది. మొత్తం నాలుగు వేరియంట్‌లలో BMW X5ను కంపెనీ లాంచ్ చేసింది. 1. 2023 BMW X5 xDrive40i xLine - రూ.93.90లక్షలు 2. 2023 BMW X5 xDrive40i M స్పోర్ట్ - రూ.1.04కోట్లు 3. 2023 BMW X5 xDrive30d xLine - రూ.95.90లక్షలు 4. 2023 BMW X5 xDrive30d M స్పోర్ట్ - రూ.1.06కోట్లు

బీఎండబ్ల్యూ

పెంట్రోల్, డీజిల్ వెర్షన్లలో తయారు

ఫేస్‌లిఫ్టెడ్ ఎస్‌యూవీ మోడల్‌లో వస్తున్న '2023 BMW X5' కారును పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌‌ మోడల్‌లో తీర్చిదిద్దారు. అలాగే బ్రాండ్ స్లిమ్మర్ హెడ్‌ల్యాంప్‌లు, మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ అడాప్టివ్ హెడ్‌ల్యాంప్‌లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. 2023 బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫేస్‌లిఫ్ట్ వెలుపలి భాగంలో చిన్న చిన్న మార్పులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇందుకోసం, గ్రిల్ 'ఐకానిక్ గ్లో', రెండు ప్రత్యేక బంపర్లను ఏర్పాటు చేశారు. టెయిల్‌ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. అత్యంత ప్రముఖమైన విజువల్ అప్‌డేట్ ఏంటంటే, 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ డిజైన్, రూఫ్ పట్టాలు కొత్త X5లో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

బీఎండబ్ల్యూ

ఇంటీరియర్, ఫీచర్లు ఇవే

క్యాబిన్ లోపల కొత్త X5 ఫేస్‌లిఫ్ట్ డ్యాష్‌బోర్డ్ 14.9అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 12.3అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన కొత్త సింగిల్-పీస్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. బీఎండబ్ల్యూ మోడల్స్‌లో అన్ని వాహనాలకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఫేస్‌లిఫ్టెడ్ X5కూడా హెడ్స్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా, 2023BMW X5 ఫేస్‌లిఫ్ట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరాతో పార్కింగ్ అసిస్ట్, అటెన్టివ్‌నెస్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ ద్వారా రిమోట్ పార్కింగ్‌తో మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.