LOADING...
బీఎండబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. BMW CE 02 ఫీచర్లు సూపర్బ్
బీఎండబ్ల్యూ సీఈ 02 ధర రూ. 6.27 లక్షలు

బీఎండబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. BMW CE 02 ఫీచర్లు సూపర్బ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 08, 2023
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను శరవేగంగా తీసుకొస్తోంది. 2022లో బీఎండబ్య్లూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొట్టమొదటి సారిగా ఆవిష్కరించింది. తాజాగా బీఎండబ్ల్యూ సీఈ 02 బైకును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.6.27 లక్షలు ఉండనుంది. ఈ బైక్ బేస్, హైలైన్ అనే రెండు వేరియంట్‌లలో లభించనుంది. బీఎమ్‌డబ్ల్యూ CE 02లో ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్‌లు, DRLలతో కూడిన స్క్వేర్డ్ అవుట్ LED హెడ్‌ల్యాంప్, సింగిల్-పీస్ సీట్, స్ప్లిట్-టైప్ గ్రాబ్ రైల్స్, LED టైల్యాంప్‌తో పాటు ఫ్లోటింగ్-టైప్ రియర్ ఫెండర్ ఉన్నాయి. దీని వీల్స్ 14అంగుళాలు ఉంటాయి.

Details

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 88.5 కిలోమీటర్లు

ఈ-బైకును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 88.5కిమీల వరకు ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ బైకు రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు సింగిల్-ఛానల్ BMW Motorrad ABS, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, రికపరేటివ్ స్టెబిలిటీ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ను అమర్చారు. ఈ బైక్ 132 కిలోల బరువు ఉంటుంది. 100శాతం చార్జింగ్ కు 5 గంటల 12 నిమిషాల సమయం పడుతుంది. గ్లాసెస్ నావిగేషన్, స్పీడ్, బ్యాటరీ స్టేటస్ వంటి అన్ని సంబంధిత డేటాను నేరుగా రైడర్ ప్రయాణించే సమయంలో తెలుసుకోవచ్చు.