మార్కెట్లోకి BMW కొత్త బైక్.. ఫీచర్లు చూస్తే కొని తీరాల్సిందే!
లగ్జరీ వాహనాలు తయారు చేసే బీఎండబ్ల్యూ సంస్థ మార్కెట్లోకి కొత్త బైకును తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్స్ తో M 1000 RR బైక్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ.49 లక్షల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం కానుంది. M 1000 RR కాంపిటీషన్ పేరిట తీసుకొచ్చిన మరో బైక్ ధర రూ.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. బైక్ ఫ్రీ ఆర్డర్లు అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా అథరైజ్డ్ డీలర్ల వద్ద నేటి నుంచి ప్రారంభించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. 2023 నవంబర్ నుంచి డెలవరీలు ప్రారంభం కానున్నాయి. ఈ సూపర్‌స్పోర్ట్‌లో కార్బన్ ఫైబర్ వింగ్‌లెట్స్, డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లున్నాయి.
3.1 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు
రైడర్ల భద్రత కోసం ఈ బైకులో వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో పాటు ABS ప్రో, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, IMU-ఆధారిత డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడల్ ఉంటుంది. ఈ బైక్ 999 సీసీ ఇంజిన్ తో రానుంది. కేవలం 3.1 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 314 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఇంజిన్ 14,500rpm వద్ద 212bhp శక్తిని, 11,000 rpm వద్ద 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏబీఎస్, ఏబీఎస్ ప్రో, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఈ బైకులో ఉండడం విశేషం. ఈ బైకును ఆన్‌లైన్‌లో లేదా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకొనే అవకాశం ఉంది.