Lexus: లెక్సస్ RC Fలో ప్రత్యేక ఎడిషన్‌లు.. ఫీచర్స్ సూపర్బ్!
లెక్సస్ లగ్జరీ కారులో ప్రత్యేక ఎడిషన్‌లు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రీమియం, లగ్జరీ ఎంపీవీ విభాగంలోకి కొత్త లెక్సన్ LM రూపంలో సరికొత్త పోటీదారు త్వరలో రానుంది. తాజాగా లెక్సస్ RC Fలో రెండు ప్రత్యేక ఎడిషన్లను రూపొందించారు.ఈ కారు వెనుకవైపున పరిమిత-స్లిప్ డిఫరెన్షియల్‌ను అమర్చారు. లెక్సస్ ఇంజనీర్లు 5.0-లీటర్ V8 ఇంజిన్‌ను మరింతగా మెరుగుపరిచినట్లు తెలుస్తొంది. దీంతో కస్టమర్లకు సున్నితమైన అనుభూతి కలుగనుంది. ఉత్సాహభరితమైన ఎడిషన్ వింగ్‌ను కలిగి ఉంది. అయితే ఎమోషనల్ టూరింగ్ వెర్షన్ సూక్ష్మమైన యాక్టివ్ స్పాయిలర్‌ను కలిగి ఉంది. LED లైట్ ను "F" లోగోలా తీర్చిదిద్దారు.
లెక్సస్ RC Fలో అధునాతన ఫీచర్లు
లెక్సస్ ప్రత్యేక ఎడిషన్‌లో 25 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది, వైట్ నోవా గ్లాస్ ఫ్లేక్, టైటానియం కార్బైడ్ గ్రే, సోనిక్ క్రోమ్, గ్రాఫైట్ బ్లాక్ గ్లాస్ ఫ్లేక్ రంగులలో అందుబాటులో ఉంది. ఎమోషనల్ టూరింగ్ ప్రత్యేకంగా టైటానియం కార్బైడ్ గ్రేలో రానుంది. రెండు వేరియంట్‌లు డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ బ్లూ ఇంటీరియర్‌తో ముందు సీట్లను ఆకర్షణీయంగా అమర్చారు. డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్ కూడా ఉండడం గమనార్హం. లెక్సస్ ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం లాటరీ విధానాన్ని అమలు చేసింది. అక్టోబరు 18 వరకు ఆ సంస్థ దరఖాస్తులను స్వీకరించనుంది. RC F ఉత్సాహి, ఎమోషనల్ టూరింగ్ ఎడిషన్‌లు ధర రూ. 83.2 లక్షలుగా నిర్ధారించారు.