2024 మజ్డా MX-5 Miata: రూపం మార్చుకుని స్టయిల్ గా మారిన కారు ఫీఛర్లు
మజ్డా కంపెనీ MX-5 Miata కొత్త వెర్షన్ ని తీసుకొస్తోంది. ఈ కారు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్ లైట్స్, డై టైమ్ రన్నింగ్ లైట్స్, సరికొత్త స్టయిల్ తో టెయిల్ లైట్స్, 16/17 అంగుళాల చక్రాలతో ఉంది. ఏరో గ్రే మెటాలిక్ పెయింట్ ఆప్షన్ ని కలిగి ఉన్న ఈ కారు ప్రస్తుతం జపాన్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. మరికొద్ది రోజుల్లో ప్రపంచ మార్కెట్లోకి రానుంది. 8.8అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని కలిగి ఉన్న ఈ కారు, ఫ్రేమ్ లెస్ రియర్ వ్యూ మిర్రర్, SOS బటన్, టైప్ సి USB పోర్ట్స్ ఉంటాయి.
2024 మజ్డా MX-5 Miata కారు ఫీఛర్లు
6స్పీడ్ గేర్ బాక్స్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ కలిగి ఉన్న ఈ కారు, భద్రత పరంగా మంచి మంచి ఫీఛర్లను కలిగి ఉంది. ఏదైనా సందర్భంలో కారును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోతే ఆ సమయంలో డైనమిక్ స్టబిలిటీ కంట్రోల్ సాయంతో కంట్రోల్ చేయగలిగే ఆప్షన్ ఉంది. 1.5లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉండడమే కాకుండా అదనంగా 4hp సామర్థ్యాన్ని కలిగి ఉంది. యాక్సిలరేట్ చేసినపుడు లేదా వేగాన్ని తగ్గించేటపుడు రెస్పాన్స్ లో ఇబ్బంది కలగకుండా ఉండడానికి 2.0లీటర్ల ఇంజిన్ అనేది మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో అనుసంధానించబడి ఉంటుంది. మజ్డా నుండి వచ్చే నెక్స్ట్ మోడల్ ఎలక్ట్రిక్ వాహనం అవుతుందని తెలియజేస్తున్నారు.