
Gracie Electric Scooter: తక్కువ బడ్జెట్‌తో లైసెన్స్ అవసరం లేకుండా నడిపే లిటిల్ గ్రేసీ ఈవీ.. మీ కోసం సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో జెలియో ఈ మొబిలిటీ తాజాగా లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ కొత్త ఈవీ మూడు వేరియంట్లలో లభించనుండగా, ప్రారంభ ధరను రూ. 49,500గా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది.
తక్కువ వేగంతో నడిచే ఈ స్కూటర్ అన్ని వయస్సులవారికీ అనుకూలంగా ఉండేలా రూపొందించబడినదని కంపెనీ చెబుతోంది.
లైసెన్స్ అవసరం లేదు!
లిటిల్ గ్రేసీ ప్రత్యేకత ఏమిటంటే, దీనిని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉండదు. బ్యాటరీ కెపాసిటీపై ఆధారపడి ధర, రేంజ్ వేరియంట్లు నిర్ణయించబడ్డాయి.
Details
ధరలు & రేంజ్
60V/30AH లి-అయాన్ బ్యాటరీ వేరియంట్
ధర - రూ. 58,000
ఛార్జింగ్ సమయం - 8-9 గంటలు
రేంజ్ - 70-75 కిమీ
60V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్
ధర - రూ. 52,000
ఛార్జింగ్ సమయం - 7-9 గంటలు
రేంజ్ - 70 కిమీ
48V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్
ధర - రూ. 49,500
ఛార్జింగ్ సమయం - 7-8 గంటలు
రేంజ్ - 55-60 కిమీ
Details
స్పెసిఫికేషన్లు
మోటార్: 48/60V BLDC మోటార్
బరువు: 80 కిలోలు
లోడింగ్ సామర్థ్యం: 150 కిలోలు
బ్రేకింగ్ సిస్టమ్: ముందూ, వెనకా డ్రమ్ బ్రేకులు
సస్పెన్షన్: హైడ్రాలిక్ * గరిష్ఠ వేగం: 25 కిమీ/గం
కలర్ ఆప్షన్స్
ఈ స్కూటర్ నాలుగు ఆకర్షణీయమైన కలర్ కలయికలలో లభించనుంది
రోజ్ 2. బ్రౌన్/క్రీమ్ 3. వైట్/బ్లూ 4. ఎల్లో/గ్రీన్ ఆధునిక ఫీచర్లు
డిజిటల్ మీటర్ , యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ డ్రైవ్, యాటీ-థెఫ్ట్ అలారంతో సెంటర్ లాక్, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో-రిపేర్ స్విచ్
Details
వారంటీ & లక్ష్యం
లిటిల్ గ్రేసీ మోటార్, కంట్రోలర్, ఫ్రేమ్‌పై రెండు సంవత్సరాల వారంటీని అందిస్తోంది.
ఇక 2025 ముగిసే నాటికి దేశవ్యాప్తంగా 1,000కి పైగా డీలర్‌షిప్‌లు ఏర్పాటు చేయాలన్నది జెలియో ఈ మొబిలిటీ ప్రధాన లక్ష్యం.
ఈ స్కూటర్, అద్భుతమైన ఫీచర్లు, లైసెన్స్ అవసరం లేకపోవడం, తక్కువ ధర - ఇవన్నీ కలిపి యువతతో పాటు వృద్ధులకు కూడా సౌకర్యవంతంగా ఉపయోగపడేలా ఉన్నాయి.