Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్ ఆవిష్కరణ.. 2027 ఏప్రిల్‌లో భారత్‌లోకి..
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త పికప్ ట్రక్‌ను ఆవిష్కరించింది. 'స్కార్పియో లైఫ్‌స్టైలర్' పేరుతో భారత మార్కెట్ కోసం ఈ వాహనాన్ని పరిచయం చేసింది. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఈ పికప్ ట్రక్‌ను కేవలం 'లైఫ్‌స్టైలర్' పేరుతో విక్రయించనుంది. తయారీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌లో ఈ కొత్త పికప్ ట్రక్‌ను 2027 ఏప్రిల్‌లో మార్కెట్లోకి తీసుకురానుంది.
వివరాలు
టయోటా హిలక్స్, ఇసుజు వీ-క్రాస్‌కు పోటీ..
భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌కు టయోటా హిలక్స్, ఇసుజు వీ-క్రాస్ వంటి పికప్ ట్రక్కులతో పోటీ ఉండనుంది.
ఈ విభాగంలో ప్రత్యర్థులపై ధర విషయంలో పైచేయి సాధించేలా మహీంద్రా కీలక ప్రకటన చేసింది.
దేశీయ మార్కెట్లో ఈ పికప్ ట్రక్ ప్రారంభ ధర రూ.19.79 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
అయితే ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర ఎంత ఉంటుందనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
వివరాలు
అమెరికన్ పికప్ ట్రక్కుల తరహా డిజైన్
స్కార్పియో లైఫ్‌స్టైలర్ డిజైన్‌లో పొడవుగా, నిటారుగా కనిపించే స్టాన్స్‌ను అందించారు.
ఇది అమెరికన్ పికప్ ట్రక్కులను తలపించేలా ఉంటుంది. ముందు భాగంలో పెద్ద గ్లోస్ బ్లాక్ గ్రిల్ ఏర్పాటు చేయగా, దానిపై మహీంద్రా సిగ్నేచర్ ట్విన్-పీక్ లోగో కనిపిస్తుంది.
గ్రిల్‌కు ఇరువైపులా ఎత్తులో అమర్చిన హెడ్‌ల్యాంప్‌లను అందించారు. వీటితో పాటు డీఆర్‌ఎల్‌లు కూడా ఉన్నాయి.
ముందు భాగంలో నిలువుగా అమర్చిన ఫాగ్ ల్యాంప్‌ల కోసం ప్రత్యేకంగా దీర్ఘచతురస్రాకార హౌసింగ్‌ను ఇచ్చారు.
వీటన్నింటినీ కలిపేలా బలమైన, రఫ్ అండ్ టఫ్ రూపాన్ని అందించే బంపర్‌ను రూపొందించారు.
బంపర్ డిజైన్ బుల్‌బార్‌ను పోలి ఉండటం వల్ల వాహనానికి మరింత దృఢమైన రూపం లభించింది.