
Mahindra SUV: భారీ డిస్కౌంట్‌లో లభిస్తున్న మహింద్రా ఎస్‌యూవీ వాహనాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్‌యూవీ మోడల్ కారును కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే సెప్టెంబర్‌లో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహింద్రా పలు ఎస్‌యూవీ వాహనాలపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఏఏ వేరియంట్లు డిస్కొంట్‌లో లభిస్తున్నాయో చూద్దాం.
మహింద్రా కంపెనీ XUV400, Marazzo, XUV300, Bolero, Bolero Neoతో సహా ఎంపిక చేసిన పలు వేరియంట్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ జాబితా నుంచి థార్, స్కార్పియో ఎన్, XUV700 వంటి ప్రసిద్ధ మోడళ్లను కంపెనీ మినహాయించింది.
ప్రతి మోడల్‌పై నగదు తగ్గింపులు లేదా యాక్సెసరీల రూపంలో డిస్కౌంట్ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ప్రయోజనాలు ధరలను బట్టి మారుతూ ఉంటాయి.
కారు
ఎక్స్‌యూవీ 400, మరాజ్జోపై భారీ తగ్గింపులు
ఈ నెలలో డిస్కౌంట్‌లో లభిస్తున్న మహింద్రా కంపెనీ ఏకైక ఎలక్ట్రిక్ వాహనం ఎక్స్‌యూవీ 400. ఈ వాహనంపై అత్యధిక డిస్కౌంట్ ఇస్తోంది. ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ రూ. 1.25 లక్షలు కావడం గమనార్హం. దీంతో ఈ వాహనం టాటా నెక్సాన్ ఈవీ కంటే మరింత సరసమైన ధరకు లభిస్తోంది.
మరాజ్జో వాహనంపై మహింద్రా కంపెనీ రూ.73,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో వాహనంపై నగదు తగ్గింపు రూ. 58,000కాగా, యాక్ససరీస్‌పై రూ.15,000 తగ్గింపు లభిస్తోంది.
బొలెరో వాహనాలపై రూ.60,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
పట్టణ యువతను ఆకర్షించే మహీంద్రా XUV300 వాహనంపై కూడా భారీగా తగ్గింపు వస్తోంది. ఈ సెగ్మెంట్‌లో పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లు రూ.71వేల వరకు తగ్గింపును కంపెనీ అందిస్తోంది.