LOADING...
Mahindra Cars: మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు.. రూ.4 లక్షల వరకు డిస్కౌంట్
మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు.. రూ.4 లక్షల వరకు డిస్కౌంట్

Mahindra Cars: మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు.. రూ.4 లక్షల వరకు డిస్కౌంట్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 24, 2026
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్ర తన ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ తగ్గింపులు ప్రకటించింది. ముఖ్యంగా మహీంద్రా XEV 9e, మహీంద్రా BE 6, మహీంద్రా XUV400 EL Pro మోడళ్లపై ఈ నెలలో రూ.4 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ తాజాగా కొత్త మోడళ్లను కూడా తన ఈవీ పోర్ట్‌ఫోలియోలోకి తీసుకువచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం..మీకు నచ్చిన మహీంద్రా మోడల్ కార్లను వెంటనే కొనుగోలు చేసేయండి.

వివరాలు

మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈపై డిస్కౌంట్

మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈపై గరిష్టంగా రూ.1.4 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రియర్ వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది. ఇందులో 59 కిలోవాట్ అవర్, 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.21.90 లక్షలు. ఈ మోడల్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే చక్కని అవకాశం.

వివరాలు

మహీంద్రా బీఈ 6పై ఆఫర్లు

మహీంద్రా బీఈ 6పై గరిష్టంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఈ వాహనం కూడా రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేసే ఈ కారు మంచి పనితీరు అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.19.65 లక్షలు. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈఎల్ ప్రోపై భారీ తగ్గింపు: ఈ మూడు మోడళ్లలో అత్యధిక డిస్కౌంట్ మహీంద్రా XUV400 ELపై ఉంది. ఈ మోడల్‌పై గరిష్టంగా రూ.4 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. 34.5 కిలోవాట్ అవర్, 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే ఈ వాహనం 359 కి.మీ నుంచి 456 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.17.49 లక్షలు.

Advertisement