Lexus Cars: మమ్ముట్టి, మోహన్‌లాల్ కొత్త లగ్జరీ కార్లు.. ధర తెలిస్తే షాకే!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న మమ్ముట్టి, మోహన్ లాల్ తమ కార్ల కలెక్షన్‌లో కొత్త లెక్సస్ మోడళ్లను చేర్చుకున్నారు. అయితే ఇద్దరూ ఒకే తరహా కారును ఎంచుకోలేదు. మమ్ముట్టి లెక్సస్ ES 350h లగ్జరీ సెడాన్‌ను కొనుగోలు చేయగా, మోహన్‌లాల్ మరింత విలాసవంతమైన LM 350h ఎంపీవీని సొంతం చేసుకున్నారు.
Details
మమ్ముట్టి గ్యారేజీలో ES 350h
మమ్ముట్టి ఎంచుకున్న లెక్సస్ ES 350h ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఎనిమిదో తరం సెడాన్.
దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.66.10 లక్షలు. TNGA GA-K ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ కారులో 14 అంగుళాల టచ్‌స్క్రీన్, మార్క్ లెవిన్సన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి.
హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, మూడు జోన్ల క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే కూడా ప్రత్యేక ఆకర్షణలు.
ఈ సెడాన్‌లో 2.5 లీటర్ల నాలుగు సిలిండర్ల స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 244 PS పవర్, 270 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. e-CVT గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.
Details
మోహన్‌లాల్ ఎంపిక.. లెక్సస్ LM 350h
మోహన్‌లాల్ మాత్రం కుటుంబ ప్రయాణాలకు అనువైన లగ్జరీ ఎంపీవీని ఎంచుకున్నారు.
టయోటా వెల్‌ఫైర్‌కు మరింత విలాసవంతమైన రూపమే లెక్సస్ LM 350h.
ఇందులో నాలుగు, ఏడు సీట్ల ఆప్షన్లు ఉన్నాయి. నాలుగు సీట్ల వెర్షన్‌లో ముందు, వెనుక వరుసల మధ్య ప్రత్యేక విభజనతో పాటు 48 అంగుళాల టీవీ, విమానాల్లో ఉండే తరహా రిక్లైనర్ సీట్లు, 23 స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
Details
ప్రయాణాన్నే లగ్జరీగా మార్చే ఫీచర్లు
వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రిజ్, హీటెడ్ ఆర్మ్‌రెస్టులు, డిజిటల్ రియర్‌వ్యూ మిర్రర్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా LM 350hలో ఉన్నాయి.
ఒకరు స్పోర్టీ లగ్జరీ సెడాన్‌ను ఎంచుకుంటే, మరొకరు ప్రయాణ సౌకర్యానికి పెద్దపీట వేశారు. మొత్తానికి మమ్ముట్టి, మోహన్‌లాల్ కొత్త కార్ల ఎంపికలు లెక్సస్ బ్రాండ్ లగ్జరీకి మరోసారి గుర్తింపు తెచ్చాయి.